Darmapuri Arvind's Twitter account suspended
Dharmapuri Arvind : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపీసీ అధ్యక్షుడిగా పనిచేస డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ . 2018 రాజీకీయాల్లో అడుగు పెట్టారు. బీజేపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపిగా బరిలో దిగారు. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న అప్పటి సీఎం కేసీఆర్ తనయ, కల్వకుంట్ల కవితను ఢీకొట్టారు. కవితను ఓడించేందుకు తనను గెలిపిస్తే వంద రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు రైతులకు బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చారు. దీంతో పసుపు రైతుల మద్దతుతోపాటు మోదీ మేనియాతో ఆ ఎన్నికల్లో అర్వింద్ ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ఎంపీ అరవింద్.. కల్వకుంట్ల కవితమై విమర్శలు చేయడం ప్రారంభించారు. మరోవైపు కవిత కూడా పసుపు బోర్డుపై అరవింద్‌ను నిలదీయడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా..
ఇదిలా ఉంటే.. అరవింద్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన గెలుపులో సోషల్ మీడియా పాత్ర కూడా ఉంది. సోషల్ మీడియా వేదికగానే అప‍్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, తనపై పోటీచేసి ఓడిపోయిన కవిత, అప్పటి మంత్రి కేటీఆర్‌పైనా విమర్శలు చేసేవారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎక్స్, ఫేస్‌బుక్‌లో తరచూ మోదీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిజామాబాద్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే అర్వింద్ ఆర్మీ పేరుతోనూ సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో ఉంది.
మార్ఫింగ్ ఫొటోల..
ఇటీవల అర్వింద్ ఆర్మీ ఖాతాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద అసభ్యకరమైన మార్ఫెడ్ ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు. దీనిని గుర్తించిన ట్విటర్.. ఈ ఖాతాను నిలపివేసింది. ఈమేరు అధికారికంగా శుక్రవారం(ఫిబ్రవరి 7న) ట్వీట్ చేసిషాక్ ఇచ్చింది. అరవింద్ టీం నడిపించే అకౌంట్‌ను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. మహిళలను అవమానించేలా అసభ్యకరమైన ఫొటో, వీడియోలు పోస్ట్ చేసినందుకు ఖాతా నిలిపివేస్తున్నట్లు ఎక్స్ అధికారికంగా ప్రకటించింది.