Akkineni Nagarjuna: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని నేడు అక్కినేని నాగార్జున మరియు ఆయన కుటుంబం కలవడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. కుటుంబం మొత్తం కలిసి అకస్మాత్తుగా ప్రధానిని కలవడానికి అసలు కారణం ఏమిటి?, ఏదైనా సమస్య వచ్చిందా? అని అభిమానుల్లో సందేహాలు తలెత్తాయి. ప్రస్తుతం పార్లమెంట్ లో జోరుగా సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నెల రోజుల క్రితమే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ని నాగార్జున అడగగా, నేడు కుదిరింది. పార్లమెంట్ సమావేశాలు బ్రేక్ సమయంలో ప్రధానిని ఈ కుటుంబం మొత్తం కలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ భేటీ ఎలాంటి రాజకీయ పరిస్థితులపై కానీ, లేదా వేరే ఏ సమస్య కోసమో జరగలేదట. ఈ భేటీ లో వాళ్ళు అక్కినేని నాగేశ్వర రావు బయోగ్రఫీ పై వస్తున్నా పుస్తకం గురించి చర్చినట్టు తెలుస్తుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే నరేంద్ర మోడీ ఇటీవలే మాన్ కీ బాత్ అనే కార్యక్రమం లో దివంగత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రస్తావించాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయనం అని ఈ సందర్భంగా కొనియాడారు. దీనికి అక్కినేని కుటుంబం స్పందిస్తూ సోషల్ మీడియా లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి కృతఙ్ఞతలు తెలియచేసిన సంగతి తెలిసిందే. నేడు ప్రత్యేకంగా కుటుంబం మొత్తం కలిసి ప్రధాని గారికి కృతఙ్ఞతలు తెలిపి కాసేపు అక్కినేని నాగేశ్వర రావు బయోగ్రఫీ గురించి, అదే విధంగా భవిష్యత్తు కార్యక్రమాల గురించి మాట్లాడారట ప్రధాని. మరోవైపు నేడు నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య ‘తండేల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా విడుదల రోజే ప్రధానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ ముఖ్య ఉద్దేశ్యం కేవలం కలిసి కృతఙ్ఞతలు చెప్పడమేనా?, లేకపోతే వేరే ఉద్దేశ్యాలు ఏమైనా ఉన్నాయా అని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ అనుమానిస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే, నాగ చైతన్య తండేల్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. గత కొంతకాలం గా అక్కినేని ఫ్యామిలీ హీరోలకు సరైన సూపర్ హిట్ లేదు. కెరీర్ మొత్తం మీద ఎన్నడూ చూడని ఘోరమైన డిజాస్టర్ సినిమాలను గడిచిన నాలుగేళ్లలో అక్కినేని కుటుంబం చూసింది. ఇక ఆ ఫ్యామిలీ పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న ఈ సమయంలో ‘తండేల్’ సక్సెస్ వారిలో మంచి జోష్ నింపింది అనే అనుకోవచ్చు. బంపర్ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో కచ్చితంగా 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు.