Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా అందరిని ఆందోళనకు గురిచేసింది. అభం శుభం ఎరుగని బాలికను మాయమాటలు చెప్పి కారులో తిప్పుతూ పలు చోట్ల అత్యాచారానికి పాల్పడటం తెలిసిందే. దీనిపై రాద్ధాంతం జరిగింది. రాజకీయ పార్టీలు కూడా కల్పించుకుని నిందితులపై చర్యలేవి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాయి. ఫలితంగా వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపినా వారు మాత్రం మళ్లీ బెయిల్ పై బయటకు రావడం కలవరం కలిగిస్తోంది.
దేశంలో చట్టాలున్నవి రక్షించడానికే తప్ప శిక్షించడానికి కాదని తెలుస్తోంది. బాలికను ఐదుగురు లైంగిక దాడి చేసినా వారికి కోర్టు ఎలా బెయిల్ ఇచ్చిందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే కేసుల్లో ఇరుక్కున్నా ప్రయోజనం ఏమిటి నాలుగు రోజులు జైల్లో ఉండి మళ్లీ దర్జాగా బయట తిరగడంలో ఆంతర్యమేమిటి? రేప్ కేసులకు కూడా బెయిల్ ఇవ్వడం సమంజసమేనా అని అందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే చట్టాలున్నవి ఎందుకో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
Also Read: Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డితో బీజేపీని కొట్టే టీఆర్ఎస్ ప్లాన్?
బాలిక రేప్ కేసులో ఒకరు మేజర్ నలుగురు మైనర్లు ఉండటం తెలిసిందే. మైనర్లయినా మేజర్లలా లైంగిక దాడులు చేయడంపై విమర్శలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు వారిని జునైవల్ హోం నుంచి బెయిల్ ఇచ్చి బయటకు పంపడంతో అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని కూడా మేజర్లుగానే పరిగణించి శిక్షలు ఖరారు చేయాలని అప్పట్లో మంత్రి కేటీఆర్ సైతం చెప్పడం గమనార్హం.
ఈ కేసులో మరో నిందితుడు మేజర్ అయిన ఎమ్మెల్యే కొడుకుకు మాత్రం కోర్టు బెయిల్ నిరాకరించింది. వీరిని కూడా అలాగే జైల్లోనే ఉంచితే బాగుండేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో బాలిక రేప్ కేసు కాస్త ఉత్తిత్తిదిగానే పరిగణించబడుతోంది. మానవ మృగాళ్లకు కఠిన శిక్షలు పడతాయని భావిస్తున్నా ఎక్కడ జరుగుతుంది. ఏం జరుగుతోంది. అంతా వట్టిదే అని తేలిపోతోంది. మరో కొన్ని రోజులు వాయిదాలతో కొనసాగించి చివరకు రాజీ కుదిర్చి కేసును కొట్టేయడం ఖాయం. ఇందుకేనా వారిని బయటకు పంపింది. దిశ కేసులో జరిగినట్లు ప్రత్యక్షంగా ఎన్ కౌంటరే సరైన పరిష్కారమని కొందరు వాదిస్తున్నారు.
Also Read: Crazy Heroine: క్రేజీ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం.. వాటి కోసమే బరితెగింపు !