Hyderabad: హైదారబాద్‌లో హై రైజ్‌ కల్చర్‌.. ఎత్తు పెరిగే కొద్ది పెరుగుతున్న రేట్లు..

హైదరాబాద్‌లో ఆకాశ హర్మ్యాలు పెరుగుతున్నాయి. గతంలో 20 నుంచి 30 అంతస్తుల భవనాలే ఉండేవి. కానీ, ఇప్పుడు 30 నుంచి 60 అంతస్తుల భవన నిర్మాణాలు పెరిగాయి. దీంతో వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 10, 2024 2:35 pm

Hyderabad(4)

Follow us on

Hyderabad: హైదరాబాద్‌లో ఇప్పుడంతా హైరైజ్‌ కల్చర్‌. ఒకప్పుడు 20 నుంచి 30 అంతస్తుల వరకు మాత్రమే భవనాలు నిర్మించేవారు. కానీ, పెరిగిన టెక్నాలజీతో ఇప్పుడు 60 అంతస్తుల అపార్టుమెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అంతస్తులు పెరగడానికి మరో కారణం.. స్థలా భావం. నగరంలో స్థలం దొరకడం కష్టంగా మారింది. దీంతో బిల్డర్లు.. భారీ నిర్మాణాలకు ప్లాన్‌ చేస్తున్నారు. అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తోపాటు నగర శివారు ప్రాంతాల్లో హై రైజ్‌ నిర్మాణాలు పెరుగుతున్నాయి. సాధారణ అపార్టుమెంట్లలో ఐదో ఫ్లోర్‌ ఉంటే.. రేట్లు తగ్గిస్తారు. కానీ హైరైజ్‌ అపార్టుమెంట్లో మాత్రం ఎంత ఎక్కువ ఎత్తులో ఉండాలనుంటే అంతగా రేట్లు పెంచుతున్నారు. అంటే.. కింది ఫ్లోర్లలో మాత్రమే రేట్లు కాస్త రీజనబుల్‌గా ఉంటాయి. పైకెళ్లేకొద్ది బిల్డర్లు రేట్లు పెంచుతూ పోతారు.

ఎత్తులో ఉండేందుకే ఆసక్తి..
చాలా మంది జనాలు ఇప్పుడు ఎత్తులో ఉండాలనుకుంటున్నారు. లిఫ్ట్‌ సమస్య రాదు. నీటి సమస్య రాదు. భద్రతకు కావాల్సింతన భరోసా ఉంటుంది. ఇరవై అంతస్తులపైన అయితే.. మార్నింగ్, ఈవినింగ్‌ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పొల్యూషన్‌ అంతపై వరకూ రాదు. అందుకే ఎక్కువ మంది 20 అంతస్తుల పైన ఫ్లాట్ల గురించే వాకబు చేస్తున్నారు. కింది అంతస్తుల్లో గాలీ, వెలుతురు సమృద్దిగా వస్తుందా లేదా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. పై ఫ్లోర్స్‌లో ఉంటే గాలి, వెలుతురు కావాల్సినంత వస్తుంది. బాల్కనీల్లోంచి చూస్తే చుట్టూ పరిసరాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అద్భుతమైన ఉదయాలు.. ఆహ్లాదకమైన సాయంత్రాలను ఎక్స్‌ పీరియన్స్‌ చేయవచ్చు. 20 అంతస్తులపైన సౌండ్‌ పొల్యూషన్‌ ఉండదు. పై అంతస్తుల్లోకి దోమలు కూడా రావు. ఇక 30 అంతస్తుల పైనుంచి చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా కంటికి పచ్చదనం కనిపిస్తుంది. పై అంతస్తుల్లో ఉంటే మిగతా వారి రాకపోకలు తక్కువగా ఉండటంతో ప్రశాంత వాతావరణం ఉంటుందని కొంత మంది భావన.

సెక్యూరిటీ, సేఫ్టీ..
ఇక పై అంతస్తుల్లో ఉంటే.. భద్రతాపరమైన సమస్యలు పెద్దగా ఎదురు కాదు. సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. పై అంతస్తులో నివసించడం అంటే ఇప్పుడు సమాజంలో హోదాగా భావిస్తున్నారు. ఎన్ని అంతస్తులు ఉన్నా.. అత్యాధునిక లిఫ్టులు .. ఎక్కడికో వెళ్తున్నామన్న భావన కలగనీయడం లేదు. అందుకే బిల్డర్లు కింద ఫ్లాట్ల విషయంలో బేరాలాడుతున్నా.. పై ఫ్లోర్ల విషయంలో మాత్రం.., రేట్లను పెంచుతున్నారు. అంటే హైలో నివసించాలంటే.. కాస్త ఎక్కువ డబ్బులు పెట్టాల్సిందే మరి.