Aadhar Update: ఇప్పుడు అన్ని శాఖల్లో గుర్తింపు కార్డుగా ఆధార్ ను అనుసంధానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో ఎలాంటి చిన్న పొరపాటు దొర్లిగా అది సమస్యాత్మకంగా మారుతుంది. కాబట్టి కార్డులో తప్పులున్నా.. ఇంకా ఏదైనా మార్చుకోవాలని అనుకుంటున్నా.. వెంటనే ఈ పని చేసుకోవాలి. 14 సెప్టెంబర్, 2024 తర్వాత, ఆధార్ కార్డులో సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేసే అవకాశం ఉండదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ) గతంలో అనేకసార్లు ఈ తేదీని పొడిగించింది, కానీ ఇప్పుడు ఈ తేదీ తర్వాత ఈ సేవ ఉచితంగా అందుబాటులో ఉండదు. మీరు ఇంకా మీ కార్డులో సమాచారాన్ని అప్ డేట్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఉచితంగా సమాచారాన్ని అప్ డేట్ చేసేందుకు చివరి తేదీ 14 సెప్టెంబర్, 2024. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ) గతంలో అనేకసార్లు తేదీని పొడిగించింది, కానీ ఇప్పుడు ఈ తేదీ తర్వాత ఈ సేవ ఉచితంగా అందుబాటులో ఉండదు.
ఆధార్ కార్డు అప్ డేట్ ఎందుకు..?
ఆధార్ కార్డు మన గుర్తింపునకు ముఖ్యమైన పత్రం. అనేక ప్రభుత్వ పథకాలు, సేవలను పొందేందుకు దీన్ని ఉపయోగిస్తారు. యుఐడీఏఐ ప్రకారం.. ప్రతీ వ్యక్తి తన ఆధార్ కార్డు సమాచారాన్ని 10 సంవత్సరాల తర్వాత అప్ డేట్ చేయాలి, దీని ద్వారా అతని చిరునామా, ఇతర సమాచారం అప్ డేట్ అవుతుంది. దీని ద్వారా ప్రభుత్వ పథకాలకు ఆయన కార్డు చెల్లుతుంది.
ఏఏ సమాచారాన్ని అప్ డేట్ చేయవచ్చు?
ఆన్ లైన్ పోర్టల్ ద్వారా మీ ఆధార్ కార్డులోని చిరునామాను అప్ డేట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. మీరు 10 సంవత్సరాలలో మీ చిరునామాను అప్ డేట్ చేయకపోతే. ఈ ప్రక్రియకు ఎటువంటి ఛార్జీలు లేవు. అయితే పేరు, మొబైల్ నంబర్, ఫొటో వంటి ఇతర సమాచారాన్ని అప్ డేట్ చేయాలని అనుకుంటే అధీకృత యుఐడీఏఐ కేంద్రాలకు వెళ్లాలి.
ఆన్ లైన్ లో అప్ డేట్ ఎలా?
మీరు మీ ఆధార్ కార్డును ఆన్ లైన్ లో అప్ డేట్ చేయగలిగితే, ఈ దశలను అనుసరించండి
ఆధార్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ను సందర్శించాలి: ముందుగా యూఐడీఏఐ వెబ్ సైట్ లోని ఆధార్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ను సందర్శించాలి.
లాగిన్: హోమ్ పేజీలో మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి లాగిన్ అయ్యి క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేయాలి.
లాగిన్ అయిన తరువాత, డాక్యుమెంట్ నవీకరణ విభాగానికి వెళ్లి, మీ ప్రస్తుత సమాచారం ప్రామాణికతను తనిఖీ చేయాలి.
డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయండి: డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి తగిన డాక్యుమెంట్లను సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ల స్కాన్ కాపీలను అప్ లోడ్ చేయాలి.
సర్వీస్ రిక్వెస్ట్ నెంబరు గుర్తుంచుకోండి: మీ సమాచారం నవీకరణ పురోగతిని ట్రాక్ చేసేందుకు సర్వీస్ రిక్వెస్ట్ నెంబరును గుర్తుంచుకోండి.
పదేళ్లకోసారి అప్ డేట్ అవసరమా..?
యుఐడీఏఐ సిఫార్సు ప్రకారం.. చిరునామా, ఇతర సమాచారం సరిగ్గా ఉండేందుకు ప్రతీ 10 సంవత్సరాలకు ఆధార్ కార్డు సమాచారాన్ని నవినీకరించడం అవసరం. దీనివల్ల ఏ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
సెప్టెంబర్ 14, 2024 తర్వాత ఆధార్ కార్డు సమాచారాన్ని ఉచితంగా అప్ డేట్ చేసుకునే అవకాశం ముగుస్తుంది. మీ ఆధార్ అప్ డేట్ పూర్తి కాకపోతే వెంటనే పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ మీ సమాచారాన్ని నవీనీకరించడమే కాకుండా.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం కొనసాగించుకోవడాన్ని సులభం చేస్తుంది.