Group 1 Job: గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ -1 రెండుసార్లు రద్దయింది. కాంగ్రెస్ ప్రభుత్వం లో గ్రూప్ -1 నిర్వహించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ విజయవంతంగా చేపట్టారు. కానీ అనేక రకాల కేసులు.. వివాదాలు గ్రూప్ -1 ను అభాసు పాలు చేశాయి. చివరికి మెయిన్స్ నిర్వహించినప్పటికీ హైకోర్టు దాకా కేసు వెళ్లడంతో ఒక్కసారిగా ధర్మాసనం కల్పించుకుంది. గ్రూప్ 1 ఫలితాలను రద్దుచేసి పునర్ మూల్యాంకనం లేదా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది. దొరికిందే తడవుగా గులాబీ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించే పనిలో పడ్డారు. స్వయం ప్రకటిత పాత్రికేయులు డిబేట్లు నిర్వహించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రోజుకు ఒక సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఇందులో ప్రధానమైన ఆరోపణ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కోసం ఓ మంత్రి మూడు కోట్లు అడిగారనేది. ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది.
ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన డిబేట్లో.. గులాబీ పార్టీ నాయకులు.. గ్రూప్ వన్ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ అభ్యర్థి సంచలన ఆరోపణలు చేశాడు. డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కోసం మూడు కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఒక ట్రాన్స్ఫర్ విషయంలో కూడా అడిగితే 30 లక్షలు ఇవ్వాల్సిందేనని చెప్పినట్టు తెలుస్తోంది. ఇదంతా కూడా ఆ డిబేట్లో పాల్గొన్న వ్యక్తి బయటపెట్టాడు. ఇక దీనిని గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా.. గులాబీ పార్టీ మీడియా తెగ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అధికారం కోల్పోయిన తర్వాత గులాబీ పార్టీ మస్త్ ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆ కాడికి వారి ప్రభుత్వ హయాంలో ఎటువంటి దందాలు జరగలేదని కవరింగ్ ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆ మంత్రి ఎవరో చెప్పే ధైర్యం లేదా
మూడు కోట్లు డిమాండ్ చేసిన మంత్రి పేరు చెప్పడానికి ఆ అభ్యర్థి వెనుకడుగు వేశాడు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రశ్నిస్తోంది. మూడు కోట్లు అడిగాడని చెబుతున్న వ్యక్తి… ఆ మంత్రి పేరు చెప్తే కూడా బాగుంటుంది కదా అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు… అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని.. మీడియా, సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని.. కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. గ్రూప్ వన్ పరీక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని.. ఉద్యోగాలను భర్తీ చేస్తుందని.. ఇందులో ఎటువంటి అనుమానం లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు..”గ్రూప్ వన్ నిర్వహిస్తున్నప్పుడు వద్దని ఆందోళనలు చేశారు. నాటి ఆందోళనలకు గులాబీ పార్టీ కార్యకర్తలు నాయకత్వం వహించారు. చివరికి గ్రూప్ వన్ నిర్వహిస్తే ఇదిగో ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎవరు ఎటువంటి అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రభుత్వం వెనకడుగు వేయదు కచ్చితంగా గ్రూప్ వన్ నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తుందని” కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
గ్రూప్ 1 జాబ్ కోసం రూ.3 కోట్లు అడిగిన కాంగ్రెస్ మంత్రి
గ్రూప్స్ ఎగ్జామ్ అభ్యర్థి సంచలన ఆరోపణలు
మా అబ్బాయికి డిప్యూటీ కలెక్టర్ పదవి కావాలి ఒక రూ.50 లక్షలు ఖర్చు పెట్టుకుంటానని కాంగ్రెస్ మంత్రిని కలిసి అడిగిన గ్రూప్స్ పరీక్ష రాసిన ఒక అభ్యర్థి తండ్రి
ఒక ట్రాన్స్ఫర్ చేయడానికే… https://t.co/36IsUFhuC1 pic.twitter.com/dYqCSaVBXe
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2025