Allu Arjun Atlee Movie: ‘పుష్ప’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు అల్లు అర్జున్… ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించడంతో సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలైతే పెరిగిపోయాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే గత సంవత్సరం రిలీజ్ అయిన ‘పుష్ప 2’ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటిని తిరగరాస్తూ 1900 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంతటి గొప్ప కలెక్షన్స్ ని సంపాదించిన హీరో మరొకరు లేకపోవడంతో అల్లు అర్జున్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగబోతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా నేపద్యంలో సినిమాలను చేస్తున్న ఆయన ఈసారి చేసే సినిమాలతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అట్లీ దర్శకత్వంలో ఇప్పుడు ఆయన ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో వీళ్ళిద్దరి కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపు రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
Also Read: ‘కిష్కిందపురి’ మూవీ టాక్ వచ్చేసింది… ఏంటి భయ్యా మరీ ఇలా ఉంది…
మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని అబుదాబిలోని ‘లివా ఒయాసిస్’ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఒక తెలుగు సినిమాను విదేశాల నేపథ్యంలో తెరకెక్కించి మన సినిమాలను యావత్ ప్రపంచ ప్రేక్షకులు ఆదరించే స్థాయికి తీసుకెళ్తున్నారు అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇక ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలను పాన్ వరల్డ్ లో రిలీజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దానికి ఏ మాత్రం తీసిపోకుండా అల్లు అర్జున్ సైతం తన సినిమాని కూడా వరల్డ్ సినిమా ప్రేక్షకులందరు చూసి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ యొక్క ఘనత ప్రపంచ ప్రేక్షకులకు తెలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం ముంబైలో భారీ సెట్లనైతే వేశారు. దానికి అనుగుణంగానే అల్లు అర్జున్ సైతం ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు…