Today 11 September 2025 Horoscope: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఇదే సమయంలో నక్షత్రం మారడం వల్ల ఆయా రాశుల జీవితాల్లో మార్పులు కనిపిస్తాయి. గురువారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో కొన్ని రాశుల వారు ఆర్థికంగా మంచి విజయాలు సాధిస్తారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. కొందరు డబ్బు విషయంలో మోసం చేసే అవకాశం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం లోపించడంతో విభేదాలు ఏర్పడతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వ్యాపారులు కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత బిజీగా మారిపోతారు. కొన్ని రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. అనుకోకుండానే ఖర్చులు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు పెండింగ్ పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే ఇంట్లో గొడవల కారణంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులకు తోటి వారి మద్దతు ఉండటంవల్ల లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టు కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విదేశాల్లో ఉండే బంధువుల నుంచి శుభవార్త వింటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులకు ఏ రోజు అనుకూలమైన వాతావరణ ఉండనుంది. మీరు గతంలో చేపట్టిన పనులలో విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. దీంతో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని ఆర్థిక అవసరాలు తీరడంతో సంతోషంగా ఉండగలుగుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు అనారోగ్యంతో బాధపడతారు. అయితే ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల వెంటనే వైద్యులను సంప్రదించాలి. కుటుంబంలో ఘర్షణ వాతావరణ ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే చాకచక్యంగా ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. సమాజంలో గౌరవం ఏర్పడుతుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎదుటివారితో మాటల కారణంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. అధికారుల మద్దతు ఉండటంతో ఉద్యోగులు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే వ్యాపారులు పెద్దలు సలహా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తోటి భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొందరు ఇబ్బందులు పెట్టడం వల్ల పనులు పెండింగ్లో పడతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థుల ఉన్నత విద్య కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు ప్రత్యర్థులను ఓడించడంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఏమైనా చిన్న సమస్యలు ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి. మాటలు కారణంగా సంబంధాలలో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు బలోపేతం అవుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వివాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు. ప్రశాంతమైన జీవితం గడుపుతారు. వ్యాపారులకు అనేక రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) . ఈ రాశి వారు ఈ రోజు అప్పుల నుంచి బయట పడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి వ్యాపారులకు కలిసి వస్తాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు పూర్తి కావడంతో మానసికంగా సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి ఖర్చులు చేస్తారు
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఈరోజు పాత స్నేహితులను కలవడంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా బంధువుల ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అయితే తల్లిదండ్రులు పిల్లల మధ్య సమన్వయం లోపించే అవకాశం ఉంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . పెండింగ్లో ఉన్న పనులను గుర్తు చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రణాళిక బద్ధంగా కొన్ని పనులను పూర్తి చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.