Telangana Congress: తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా.. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది?.. అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందా.. ప్రతిపక్ష పార్టీ తన స్థానాలను నిలుపుకుంటుదా.. ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే ఈ వ్యవహారంపై గులాబీ పార్టీ ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లడం.. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించడం.. స్పీకర్ కు నోటీసులు ఇవ్వడం.. వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో స్పీకర్ ఆ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఫలితంగా వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదని స్పీకర్ కు సమాధానం చెప్పారు. అయితే ఆ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. వారి స్థానాలలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని స్పష్టం చేస్తోంది. ఎలాగూ ఆ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని మరి కొంతమంది అంటున్నారు.
Also Read: సుఖ సంసారానికి పనికి రాని 72 ఏళ్ల వరుడు.. నవ యవ్వనపు 27 ఏళ్ల వధువు.. ఇదేం పెళ్లి రా నాయన?
ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఆ 10 స్థానాలలో ఎవరు గెలుస్తారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇటీవల జూబ్లీహిల్స్ శాసనసభ సభ్యుడు మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో కన్నుమూసిన నేపథ్యంలో.. ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఆ ఎన్నికలో గులాబీ పార్టీ నుంచి గోపీనాథ్ సతీమణిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారు అయిందని తెలుస్తోంది. బిజెపి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ తోపాటు ఆ పది నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగితే జగిత్యాల, గద్వాల స్థానాలలో మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందని ఓ సర్వే లో తేలింది. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ సర్వే కు సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి.
వాస్తవానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, గులాబీ పార్టీల మధ్య హో రాహోరీగా పోరు జరుగుతుందని తెలుస్తోంది. ఆ పోరులో గులాబీ పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని తెలుస్తోంది. మాగంటి గోపీనాథ్ కు ఉన్న చరిష్మా ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి తోడ్పడుతుందని సమాచారం. అయితే గతంలో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలుస్తానని.. ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెడతానని నవీన్ యాదవ్ చెబుతున్నారు. నవీన్ యాదవ్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవిని కేటాయించి.. నవీన్ యాదవ్ కు లైన్ క్లియర్ చేశారు. తద్వారా జూబ్లీహిల్స్ లో పోటీకి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఎన్నికలు అన్నాక అనేక సర్వేలు బయటికి వస్తాయి. ఎవరికి తోచింది వారు చెబుతుంటారు. ఈ సర్వేలు నిజం కావాలని లేదు. అలాగని అబద్ధం అవుతాయని కూడా లేదు. అంతిమంగా ప్రజలు మాత్రమే ఎన్నికల్లో విజేతలను నిర్ణయించగలరు.
తెలంగాణలో 10 చోట్ల ఉప ఉన్నికలు జరిగితే 2 చోట్ల తప్ప కాంగ్రెస్ ఎక్కడా గెలవదు
అది కూడా గద్వాల, జగిత్యాలలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ వీళ్లకు సపోర్ట్ చేస్తేనే గెలుస్తారు
కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేలో వాస్తవాలు వెల్లడించిన సైదులు
Video Credits – 10TV pic.twitter.com/EdEaIt52ro
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2025