Jodhpur Ukrainian Couple: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. వయసు దాటిపోతే పెద్దగా ఉపయోగం ఉండదు. వెనుకటి కాలంలో బాల్యవివాహాలు అధికంగా జరిగేవి. వాటి వల్ల అనర్ధాలు అధికంగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆ తర్వాత ప్రభుత్వం వివాహ వయసును నిర్ధారించింది. ఆ వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తే ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగని వయసు దాటిపోతే పెళ్లి చేసుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదు.
నేటి కాలంలో వయసు అనేది ఒక నెంబర్ గా మాత్రమే ఉంటున్నది. చాలామంది చదువు, కెరియర్, ఉద్యోగం అంటూ పెళ్లిని వాయిదా వేస్తున్నారు. కొంతమందయితే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు.. ఇంకా కొంతమందయితే నాలుగుపదుల వయసు దాటిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పిల్లల్ని కూడా ఐవీఎఫ్ విధానంలో కంటున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 72 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. కాటికి కాళ్ళు చాపే వయసులో అతడు పెళ్లి చేసుకోవడం ఒకరకంగా సంచలనం కలిగించింది. పైగా అతడు చేసుకుంది ఏ బామ్మనో కాదు. తన మనవరాలు వయసు ఉన్న అమ్మాయిని. ఆ అమ్మాయికి 27 సంవత్సరాల వయసు ఉంటుంది. ఏ ప్రకారం చూసుకున్నా 45 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఇంతటి వ్యత్యాసం ఉన్నా కూడా ఆ యువతి పెళ్లికి ఒప్పుకోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వివాహం మనదేశంలోని రాజస్థాన్లో జరిగింది.
కోటలకు.. చారిత్రాత్మక ప్రదేశాలకు నెలవైన రాజస్థాన్ రాష్ట్రంలో హిందూ సంప్రదాయంలో ఓ వివాహం జరిగింది. వివాహం చేసుకున్న వ్యక్తిది ఉక్రెయిన్ దేశం.. అతనికి 72 సంవత్సరాల వయసు. పేరు స్టాని స్లావ్.. పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు ఏంజలీనా. కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో వారిద్దరు భారత్ వచ్చారు. ఇక్కడ సంస్కృతిని, ఆధ్యాత్మికతను చూసి ఫిదా అయిపోయారు. అందువల్లే భారతీయ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వారి పెళ్లికి బంధువులు ఎవరూ రాకపోవడం విశేషం. పైగా తనకు స్టాని అంటే చాలా ఇష్టమని ఏంజలీనా చెప్పడం విశేషం.
#Watch: राजस्थान का जोधपुर एक बार फिर विदेशी मेहमानों की शाही शादी का गवाह बना है। इस बार यहां यूक्रेन के रहने वाले एक जोड़े ने भारतीय तौर-तरीकों से प्रभावित होकर हिंदू वैदिक रीति-रिवाजों से सात फेरे लिए। 72 साल के दूल्हा स्टानिस्लाव और 27 साल की दुल्हन अनहेलीना शादी के बाद बेहद… pic.twitter.com/XrsSLrs9z7
— Hindustan (@Live_Hindustan) September 19, 2025