CM Revanth Reddy: కేసీఆర్‌ కు షాక్‌.. మరో పెద్ద బీఆర్‌ఎస్‌ వికెట్‌ ను పట్టేసిన రేవంత్‌!

మాజీ మంత్రి, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు. చాలాసేపు ఇద్దరూ భేటీ అయ్యారు. పోచారం శ్రీనివాస్‌ను సీఎం కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్‌ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.

Written By: Raj Shekar, Updated On : June 21, 2024 12:18 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం.. లోక్‌సభ ఎన్నికల్లో సున్నా చుట్టేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమైన ప్రస్తుత తరుణంలో ఆ పార్టీకి మరో పెద్ద షాక్‌ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పదేళ్లు ఆ పార్టీలో ఉండి వివిధ పదవులు అనుభవించిన కె.కేశవరావులాంటి సీనియర్‌ నేతలతోపాటు ఎమ్మెల్యేలు, నాయకులు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అధికార హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఉనికి చాటుతుందని చాలా మంది భావించారు. కానీ, ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు జాతీయ పార్టీలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌ మరోమారు ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు పెట్టింది.

‘పోచారం’ ఇంటికి సీఎం..
మాజీ మంత్రి, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు. చాలాసేపు ఇద్దరూ భేటీ అయ్యారు. పోచారం శ్రీనివాస్‌ను సీఎం కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్‌ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నం గత కొద్ది రోజులుగా సాగుతుంది. గత ఎన్నికల్లో బాన్సువాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచారు.

బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై అసంతృప్తి..
ఇదిలా ఉండగా, బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై పోచారం శ్రీనివాస్‌రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని పోచారం ఏనాడు ఖండించలేదు. ఈ క్రమంలో శుక్రవారం జూన్‌ 21న సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పోచారం ఇంటికి వెళ్లడంతో ఇక పోచారం అధికార పార్టీలో చేరడం ఖాయమైంది.

పోచారంతో మొదలు..
ఇక కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు పెట్టింది. దీంతో ఇక బీఆర్‌ఎస్‌ ఖాళీ కావడం ఖాయమని తెలుస్తోంది. పోచారంతో మొదలు పెట్టిన ఈ ఆపరేషన్‌ గులాబీ పార్టీలోని కీలక నేతలను లాగేయడం ఖాయంగా కనిపిస్తోంది.