Amaravati: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్..

ప్రధానంగా ఎర్రుపాలెం- అమరావతి- నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ నిర్మించాలని భావించారు. దాని బదులు ఇప్పుడు మొదట సింగిల్ లైన్ నిర్మాణానికి సిద్ధమవుతోంది రైల్వే శాఖ. ఈ లైన్ కు గుంటూరు, పల్నాడు, కృష్ణ, ఖమ్మం జిల్లాల పరిధిలోని 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయబోతున్నారు.

Written By: Raj Shekar, Updated On : June 21, 2024 12:13 pm

Amaravati

Follow us on

Amaravati: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి కి సంబంధించి కీలక నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. ప్రత్యేక రైల్వే లైన్ కు సంబంధించి భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పావులు కదిపింది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కలిగించింది. కొత్త రైల్వే లైన్లకు సంబంధించి క్లియరెన్స్ లు ఇస్తోంది. గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలి, భూ సేకరణ వ్యయం భరించాలని చెప్పిన రైల్వే శాఖ.. ఇప్పుడు పూర్తిగా తమ నిధులతోనే ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ముందుకు రావడం విశేషం.

విజయవాడ, గుంటూరు రైల్వే లైన్లతో ఏపీ రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం ప్రతిపాదించిన ఈ కొత్త రైల్వే లైన్ 2017 -18 లోనే మంజూరు అయ్యింది. ప్రధానంగా ఎర్రుపాలెం-అమరావతి- నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర డబ్బులు లైన్, అమరావతి- పెదకూరపాడు మధ్య 24 కిలోమీటర్ల సింగల్ లైన్ కు కసరత్తు చేస్తున్నారు. అలాగే సత్తెనపల్లి- నరసరావుపేట మధ్య 25 కిలోమీటర్ల సింగిల్ లైన్ కలిపి.. మొత్తం 106 కిలోమీటర్ల మేర కొత్త లైన్ కు ఆమోదం తెలిపారు.. కానీ గత ఐదేళ్ల వైసిపి హయాంలో ఎటువంటి ముందడుగు పడలేదు.ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో రైల్వే శాఖ చాలా వేగంగా స్పందిస్తోంది. వీలైనంత త్వరగా అమరావతికి సంబంధించి రైల్వే ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించాలని భావిస్తోంది.

ప్రధానంగా ఎర్రుపాలెం- అమరావతి- నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ నిర్మించాలని భావించారు. దాని బదులు ఇప్పుడు మొదట సింగిల్ లైన్ నిర్మాణానికి సిద్ధమవుతోంది రైల్వే శాఖ. ఈ లైన్ కు గుంటూరు, పల్నాడు, కృష్ణ, ఖమ్మం జిల్లాల పరిధిలోని 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయబోతున్నారు. ఈ సింగిల్ లైన్ నిర్మాణంతో పాటు భూసేకరణకు రూ.2500 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది రైల్వే శాఖ. ఈ కొత్త రైల్వే లైన్ విజయవాడ హైదరాబాద్ లైన్ లో ఎర్రుపాలెం దగ్గర మొదలై.. అమరావతి మీదుగా గుంటూరు- విజయవాడ లైన్ లోని నంబూరు దగ్గర కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత తొమ్మిది కొత్త స్టేషన్లను నిర్మాణాలు చేయనున్నారు. పెద్దాపురం, చిన్న రావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పు రావూరులలో ఈ స్టేషన్లో నిర్మిస్తారు. వీటిలో అమరావతిని ప్రధాన స్టేషన్ గా పరిగణిస్తున్నారు. మొత్తానికైతే అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కావడం, ఇప్పుడు కొత్త రైల్వే లైన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అమరావతి ప్రాంతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.