HomeతెలంగాణCabinet Expansion : కేబినెట్‌ విస్తరణకు లైన్‌ క్లియర్‌.. బెర్తుల కోసం కసరత్తు షురూ.. రేసులో...

Cabinet Expansion : కేబినెట్‌ విస్తరణకు లైన్‌ క్లియర్‌.. బెర్తుల కోసం కసరత్తు షురూ.. రేసులో ఎవరంటే?

Cabinet Expansion : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్‌ బెర్తుల ఖాళీలు భర్తీ చేసేందుకు హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో కసరత్తు మొదైలంది. కాంగ్రెస్‌ మార్కు రాజకీయాలు రాష్ట్రంలో ఊపందుకున్నాయి. తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్‌ విస్తరణ కోసం అనుమతి తీసుకున్నారు. ఆరుగురి పేర్లు ఖరారు చేసుకుని వస్తారని తెలుస్తోంది. దీంతో ఆశావహులు అలర్ట్‌ అయ్యారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా మరో జాబితాతో ఢిల్లీ వెళ్లారు. ఆయన ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతోపాటు మరికొంతమంది కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా భట్టిని కలిశారు. తన పేరు సిఫారసు చేయాలని కోరారని సమాచారం.

జగ్గారెడ్డి రచ్చ..
ఇదిల ఉంటే.. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఢిల్లీలో రచ్చ చేశారు. పార్టీలో పాత వారికన్నా కొత్తవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస మున్షికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ను చంపేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు మంత్రి పదవి ఆశిస్తున్న పలువురు హస్తిన బాట పట్టారు. సామాజిక సమీకరణలకు కేబినెట్‌ల్‌లో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మున్షి కూడా కీలకం..
కేబినెట్‌ బెర్తుల భర్తీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె కూడా కొందరి పేర్లు సిఫారసు చేశారని సమాచారం. సీనియరుల, సీఎం, ఇన్‌చార్జి తమ తమ పేర్లతో ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పుడు ఎవరి జాబితాకు హైకమాండ్‌ ఆమోదం తెలుపుతుందన్న టెన్షన్‌ నెలకొంది.

నల్గొండ లీడర్ల అడ్డు..
మరోవైపు కేబినెట్‌ విస్తరణకు నల్గొండ నేతలు అడ్డు పడుతున్నట్లు తెలిసింది. నల్గొండ జిల్లా నుంచి ప్రస్తుత ఏబినెట్‌లో ఒకే సమాజికవర్గం నేతలు ఉన్నారు. కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రులుగా ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈనేపథ్యంలో కేబినెట్‌ విస్తరణను ప్రభావితం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కూడా కారణం. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా ఈ విషయంపై దృష్టిసారించింది. మరోవైపు తాజా విస్తరణలో హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper
Exit mobile version