వెనకటి కాలంలో పుస్తకాలలో రాముడు మంచి బాలుడు అనే ఒక మంచి మాట ఉండేది. ఆ మాట లోకోక్తిగా వినతి కెక్కింది. రాముడి గుణగణాలనే కాదు.. రాముడి పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి మంచి లక్షణాలు ఉంటాయని ఆ మాట ద్వారా తెలుస్తోంది. అంతటి మంచి పేరు పెట్టుకున్న ఈ వ్యక్తి మాత్రం
.. ఆ పేరుకు మంచి చేయలేకపోయాడు. అంతేకాదు ఇంకా చాలా చేశాడు.. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి.. ఫోకస్ పెడితే తప్ప ఈ రాముడి లో రావణుడి లక్షణాలు బయటపడలేదు.
హైదరాబాద్ నగరంలో కొన్ని సంవత్సరాలుగా హైడ్రా దూకుడుగా అడుగులు వేస్తోంది. అక్రమ నిర్మాణాలను పడగొడుతోంది. చెరువులను.. కుంటలను.. నాలాలను అక్రమార్కుల నుంచి విడిపిస్తోంది. ఇంతవరకు హైడ్రా చేపట్టిన ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. ఇందులో కొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయి. తాజాగా హైడ్రా సోమాజిగూడ లోని ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి సంబంధించిన బిల్డింగ్ ను సీజ్ చేసింది. అదే కాదు సంధ్య శ్రీధర్ రావు అనే వ్యక్తికి సంబంధించిన స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల మీద గురి పెట్టింది.. వాస్తవానికి సంధ్య శ్రీధర్.. ప్రదీప్ కన్స్ట్రక్షన్.. ఇది పేరుకు వేరువేరుగానే అనిపిస్తున్నప్పటికీ.. అసలు వ్యక్తి మాత్రం ఒక్కడే.. అతని పేరు రాముడు అలియాస్ రియల్ ఎస్టేట్ రాముడు.. పేరుకు తగ్గట్టుగా అతడు రాముడు కాదు రావణుడు. హైదరాబాద్ నగరంలో అత్యంత భారీగా బినామీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.
హైదరాబాద్ నగరంలో సాగిన భూ దందాలలో రియల్ ఎస్టేట్ రాముడు తనముద్ర అత్యంత బలంగా వేశాడు. అసలు అతని అడుగులేని భూ దందా లేదంటే పరిస్థితి ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బఫర్ జోన్లు.. ఎఫ్ టి ఎల్ పరిధిలు అతనికి ఏమాత్రం అడ్డుకావు. బఫర్ జోన్ లో అతడు ఎన్నో లేక్ ల్యాండ్స్‌లో నిర్మాణాలు నిర్మించాడు. పేదలకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములలో కూడా అతడు నిర్మాణాలు చేపట్టాడు. చివరికి టీఎస్ ఐఐసి కి సంబంధించిన ప్రభుత్వ భూములను కూడా అతడు వదిలిపెట్టలేదు.. అతడికి చట్టాలు జస్ట్ చుట్టాలు. అత్యంత విలువైన భూములను అతడు తన జేబులో వేసుకున్నాడు. చివరికి బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇతడికి రియల్ ఎస్టేట్ రాముడు అని పేరు పెట్టాడు అంటే.. అతడి భూదందాలను అర్థం చేసుకోవచ్చు.
రియల్ ఎస్టేట్ రాముడు గురించి హైడ్రా ఆరా తీస్తోంది. గతంలో అతడు గచ్చిబౌలి.. మాదాపూర్.. శేరిలింగంపల్లి వంటి ప్రాంతాలలో అక్రమ కట్టడాలను నిర్మించాడు. అనుమతులు లేకపోయినప్పటికీ అతడు పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో ఇతడు తనకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాడు. తెలంగాణ రాష్ట్రంలో అధికార కేంద్రాలు మారిపోవడం.. రేవంత్ రెడ్డి హైదరాబాద్ రంగనాథ్ కు పూర్తిస్థాయిలో బాధ్యతలు ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ రాముడికి బ్యాడ్ టైం మొదలైంది. సంధ్యా శ్రీధర్ రావు.. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వంటి కంపెనీలకు సంబంధించిన దస్త్రాలను రేవంత్ ప్రభుత్వం తడబడడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రాముడి భూ వ్యవహారాలు బయటికి వచ్చాయి. దీంతో హైడ్రా ఇతడి బండారం మొత్తం బయట పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఒకరకంగా రియల్ ఎస్టేట్ రాముడి బినామీ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టడానికి హైడ్రా బాస్ రంగనాథ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. భూ రికార్డులను.. శాటిలైట్ మ్యాప్స్.. రెవెన్యూ రికార్డులను తెలంగాణది బృందం సిద్ధం చేసినట్టు సమాచారం. ఒకవేళ ఈ నెట్వర్క్ మీద హైడ్రా గట్టి దెబ్బ కొడితే.. రియల్ ఎస్టేట్ నల్ల దొరల అసలు రంగు బయట పడుతుందని కామెంట్ వినిపిస్తున్నాయి.
