CM Revanth Reddy: రేవంత్ సంకేతాలు.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు వారేనా?

రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఆ పార్లమెంటు స్థానాలలో పోటీ చేసేందుకు పలువురు ఆశావహుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 309 దరఖాస్తులు వచ్చాయి.

Written By: Velishala Suresh, Updated On : February 23, 2024 4:46 pm
Follow us on

CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే వారెవరో తేలిపోయిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి హింట్స్ ఇచ్చారా? దీనికి అవును అనే సమాధానం చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇటీవల పాలమూరు జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొస్గి ప్రాంతంలో రేవంత్ రెడ్డి భారీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో రావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేశారు. ఆ సమావేశం వేదికగా రేవంత్ రెడ్డి త్వరలో అమలు చేయబోయే రెండు గ్యారెంటీ ల గురించి ప్రస్తావించారు.. ఆ ప్రస్తావన ముగిసిన తర్వాత పాలమూరు జిల్లాలో ఎంపీగా ప్రస్తావన ముగిసిన తర్వాత పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పోటీలో ఉంటారని.. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని పాలమూరు జిల్లా ప్రజలను రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి 50వేల ఓట్ల మెజారిటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభలోనే వంశీ చేపట్టుకుని లేపి గెలిపించాలని కోరారు.

ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే వారెవరో తేలిపోయిందా? ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించారా? చర్చ జరుగుతోంది. ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. ఇస్తానానికి ఒక నివేదిక అందించారు. ఆ నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. సునీల్ ఇచ్చిన నివేదికపై ఇద్దరు చర్చించారు. దీనికి సంకేతం గానే ముఖ్యమంత్రి కొస్గి సభలో వంశీచంద్ రెడ్డి పేరును రేవంత్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఆ పార్లమెంటు స్థానాలలో పోటీ చేసేందుకు పలువురు ఆశావహుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 309 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 48, ఆ తర్వాత వరంగల్ నుంచి 42 దరఖాస్తులు వచ్చాయి. మొన్నటిదాకా వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ఆశించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు.. పార్లమెంటు స్థానం నుంచి దరఖాస్తు చేసిన రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఆశించిన అనిల్ కుమార్ యాదవ్ కు కూడా రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అన్ని కోణాల్లో సర్వే చేసిన తర్వాతనే సునీల్ బృందం ముఖ్యమంత్రి కి ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తేలింది. అభ్యర్థి ఎవరు? అతడు ఎందుకు గెలుస్తాడు? అతడికి ఉన్న సాధ్యాసాధ్యాలు ఏమిటి? అన్ని కోణాల్లో సర్వే చేసిన తర్వాతే సునీల్ రేవంత్ రెడ్డి ని కలిసి నివేదిక అందించారని తెలుస్తోంది. సునీల్ ఇచ్చిన నివేదిక తనకు పూర్తిగా తెలియడంతోనే రేవంత్ రెడ్డి వంశీ చంద్ పేరును ప్రకటించారని సమాచారం.