Journalist Attack: ప్రజలకు, ప్రభుత్వానికి మీడియా వారధిగా ఉండాలి. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. వారధిగా ఉన్న ప్రజల సమస్యలను.. ప్రభుత్వ విధానాల్లో లొసుగులను బయటకు తీయాలి. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. దురదృష్టవశాత్తు ఈ వాస్తవాలను ప్రభుత్వాలు జీవించుకోలేవు. వాస్తవాలు చెప్పే జర్నలిస్టులను సహించలేవు. అప్పట్లో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు మీడియాను రెండు కిలోమీటర్ల లోతులో తొక్కి బొంద పెడతానని కేసీఆర్ హెచ్చరించారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాస్తోంది అనే అక్కసుతో కొన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకుండా ఆపేశారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితికి చెందిన కార్యక్రమాలకు ఒక సెక్షన్ మీడియాను పిలవడం పూర్తిగా మానేశారు. అప్పట్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నాడు అనే కారణంతో క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న ను ప్రభుత్వం అరెస్టు చేయించింది. అతడి ఆఫీసు పై దాడులు చేయించింది. సుదీర్ఘకాలం జైల్లో ఉన్న తర్వాత తీన్మార్ మల్లన్న బయటికి విడుదలయ్యాడు. సేమ్ ఇలాగే మన తొలి వెలుగు యూట్యూబ్ న్యూస్ ఛానల్ అధిపతి రఘు ను కూడా పోలీసులు ఇలాగే అరెస్టు చేశారు. పట్టపగటిపూట అతడిని వేరే వాహనంలో తరలించారు. ఇలా చెప్పుకుంటూ పోతే భారత రాష్ట్ర సమితి హయాంలో మీడియాపై జరిగిన దాడులు ఎన్నో.
భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ఎన్నికలకు ముంగిట కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులు అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక స్వరం వినిపించారు. అయినప్పటికీ ఎన్నికల్లో వారి పాచికలు పారలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారు అదే స్థాయిలో ప్రభుత్వ విధానాల మీద వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఇవి వార్తల్లా కాకుండా వేరే తీరుగా ఉంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సహజంగానే వారిపట్ల అధికార పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాకముందే ఇలా అబాండాలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని వారు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు సమయమనమే పాటిస్తున్నారు..

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి పై నిన్న హైదరాబాదులో కొంతమంది దాడి చేశారు. ఆ దాడిలో అతడు గాయపడ్డాడు. తనపై దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలని ఆ బాధిత జర్నలిస్టు ఆరోపిస్తున్నాడు. అతడు గాయపడిన ఫోటోను ప్రముఖంగా ప్రస్తావిస్తూ భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశాడు. అయితే కేటీఆర్ ట్వీట్ కు కొంతమంది అనుకూలంగా.. మరికొంతమంది వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. అప్పట్లో మీ హయాంలో జరిగిన వాటిని గురించి కూడా ప్రస్తావించండి అంటూ కొంతమంది నెటిజన్లు కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇటీవల అనంతపురం జిల్లాలోని రాప్తాడు లో ఓ పత్రికకు చెందిన ఫోటోగ్రాఫర్ ను వైసీపీ నాయకులు చితక బాదారు. ఆ సంఘటన మర్చిపోకముందే హైదరాబాదులో యూట్యూబ్ జర్నలిస్టుపై కొంతమంది దాడి చేశారు..
ఈ ఘటనలో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఎంత ఉంది? నిజంగా ఆ దాడికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ దాడి జరుగుతున్నప్పుడు పక్కనే ఉన్న మహిళలను విచారిస్తే పూర్తి వివరాలు బయటపడతాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. అయితే ఈ దాడిలో ఆ మహిళలకు ఏంటి సంబంధం? అనే ప్రశ్న తాజాగా వ్యక్తమవుతోంది. అయితే ఆ జర్నలిస్ట్ పై దాడికి కొందరు అమ్మాయిలే కారణమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బాధిత జర్నలిస్ట్ కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రతి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జనసేన, టీడీపీల అరాచకాలు, అనైతిక పొత్తులు, వారు ప్రజలను వంచించే ఎత్తుగడలను నిరంతరం ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్ శంకర్ మీద నిన్న రాత్రి ఏకంగా దాడికి తెగబడ్డారు పచ్చ ముఠా. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతం. యెల్లో మీడియా చేసే అరాచకాలను ప్రశ్నిస్తే తట్టుకోలేక జర్నలిస్టుల మీద ఇలాంటి… pic.twitter.com/mqPbiUrZMk
— YSR Congress Party (@YSRCParty) February 23, 2024