CM Revanth Reddy: తెలంగాణ ప్రతిపక్ష నేతగా ఎన్నికైన బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Kalvakuntla Chandrashekar Rao)ఆ పదవికి కనీస న్యాయం చేయడం లేదు. ప్రజల తరఫున ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలనిన కేసీఆర్ అసలు అసెంబ్లీకే రావడం లేదు తన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్‌రావును మాత్రమే పంపుతున్నారు. వారు ప్రభుత్వాన్ని విమర్వించడానికే పరిమితమవుతున్నారు. పాలనలో ప్రభుత్వం పాత్ర ఎంత ఉంటుందో ప్రతిపక్షం పాత్ర కూడా అంతే ఉంటుంది. కానీ, కేసీఆర్(KCR) మాత్రం తనను ఓడించిన ప్రజలు ఎటుపోతే ఏంటి అన్నట్లుగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం కూడా చేయడం లేదు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Assembly Budjet Meetiongs) ప్రస్తుతం జరుగుతున్నాయి. గవర్నర్(Governar) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై శనివారం(మార్చి 15న) చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, పనితీరును అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ నేతల నుంచి∙తీవ్ర విమర్శలను వ్యక్తమవుతున్నాయి.
Also Read: కేసీఆర్ ప్రాణాలకు వారితోనే ముప్పు.. అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం సంచలన ప్రకటన!
కేసీఆర్ దగ్గర తీసుకోవడానికి ఏమీ లేదు..
ప్రతిపక్ష నేత చంద్రశేఖర్ రావు దగ్గర తాను నేర్చుకోవడానికి లేదా తీసుకోవడానికి ఏమీ లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోయిందని, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా ‘గుండు సున్నా‘ సాధించిందని ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలతో బీఆర్‌ఎస్ రాజకీయంగా ‘మార్చురీకి‘ చేరిందని తాను వ్యాఖ్యానించినా, దానిని కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శగా కేటీఆర్ మరియు హరీశ్‌రావు చిత్రీకరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ప్రతిపక్షంలో కూర్చుంటే తాను అధికార పక్షంలో ఉండాలని కోరుకుంటున్నానని రేవంత్ తెలిపారు. ఇది తన ఉద్దేశంలో వ్యక్తిగత దూషణ కాదని, రాజకీయ విమర్శ మాత్రమేనని సమర్థించుకున్నారు.
కేసీఆర్ తీసుకున్న జీతం రూ.57,84,124
సీఎం రేవంత్ రెడ్డి మరో ఆరోపణలో, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ కేవలం రెండుసార్లు మాత్రమే శాసనసభకు హాజరై, రూ.57,84,124 జీతం తీసుకున్నారని వెల్లడించారు. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఆయనకు ప్రాణ ప్రమాదం ఉందనే కారణంతో సెక్యూరిటీ తీసుకున్నారని, అయితే బీఆర్‌ఎస్ నేతలు దీనిని ‘రేబిస్ వ్యాక్సిన్ రియాక్షన్‘లా చిత్రీకరిస్తున్నారని రేవంత్ సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలతో కేసీఆర్ పనితీరును, బాధ్యతారాహిత్యాన్ని ఆయన తీవ్రంగా ఎండగట్టారు.
నేను మాట్లాడింది తప్పా?
కేసీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభలో నిరసన చేపట్టడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ‘బీఆర్‌ఎస్ ఒకప్పుడు అధికారంలో ఉండేది, తర్వాత ప్రతిపక్షానికి పడిపోయింది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు కోల్పోయి గుండు సున్నాకు చేరి మార్చురీకి వెళ్లిందని అన్నాను. ఇందులో నేను మాట్లాడినది తప్పా?‘ అని ఆయన ప్రశ్నించారు. తాను కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినట్లు కేటీఆర్, హరీశ్ రావు చిత్రీకరిస్తున్నారని, అలాంటి స్వభావం తనది కాదని స్పష్టం చేశారు. ఈ వివాదంలో తన వ్యాఖ్యలు రాజకీయ సందర్భంలోనే ఉన్నాయని, వ్యక్తిగత దాడిగా చూడరాదని రేవంత్ వాదించారు.