Vijay : తమిళనాడు, కర్ణాటక వంటి ప్రాంతాల్లో చాలా కాలం నుండి మూడు బాషల విధానంపై అక్కడి రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గా తమిళనాడు లో కొత్తగా పుట్టుకొచ్చిన హీరో విజయ్(Thalapathy Vijay) పార్టీ ‘తమిళగ వెట్రి కజగం'(Tamilaga Vetri Kazhagam) కూడా ఈ విధానం పై మండిపడ్డాడు. మా పై బలవంతంగా హిందీ బాషా నేర్చుకోవాలని రుద్దకండి అంటూ బహిరంగ సభల్లో చెప్పుకొచ్చాడు. మొన్న జరిగిన మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం లో కూడా ఆయన ఇదే నినాదం ని బలంగా వినిపించాడు. కానీ ఇక్కడే ఆయన అడ్డంగా దొరికిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయ్ కి తమిళనాడు లో ‘విజయ్ విద్యాశ్రమ్’ అనే స్కూల్ ఉంది. ఈ స్కూల్ చెంగల్ పేట్ జిల్లాలోని పాడూరు గ్రామం లో ఉంటుంది. ఈ స్కూల్ లోని విద్యార్థులకు విజయ్ CBSC సిలబస్ ని అందిస్తున్నాడు.
Also Read : తమిళ హీరో విజయ్ పై పోలీస్ కేసు నమోదు..అరెస్ట్ చేయడానికి సిద్దమైన స్టాలిన్ ప్రభుత్వం?
CBSC అంటే కచ్చితంగా అందులో హిందీ భాష ఉంటుంది. తనకు వ్యాపారం చేసుకోవడం కోసం మాత్రం హిందీ భాష కావాలి, కానీ రాజకీయాల్లో మాత్రం తమిళ భాష ని సెంటిమెంట్ గా వాడుకొని ఓట్లు సంపాదించాలి. ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నిలదీస్తున్నారు. ఒకప్పుడు రంజాన్ మాసం లో ఇఫ్తార్ విందు ఇవ్వండం వంటివి విజయ్ ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం తన పార్టీ తరుపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే ఆయన రాజకీయాల కోసమే ఇలా ప్రవర్తిస్తున్నాడని, తన మనసులోని నిజమైన భావనలు లాగా అనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే విజయ్ ఏ ప్రస్తావన తో అయితే తన రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టాడో, అది తన నిజ జీవితం లో మాత్రం పాటించకపోవడం ఇది ఆయనకు పెద్ద మైనస్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
తమిళనాడు లో పాగా వెయ్యాలని చూస్తున్న బీజేపీ పార్టీ కి ఇది బ్రహ్మాస్త్రం అవ్వొచ్చు. కేవలం ఈ ఒక్క విషయంలో మాత్రమే కాదు, అనేక అంశాలలో విజయ్ కి ఎక్కడో క్లారిటీ తప్పుతుంది. ఆయన అభిమానులకు కూడా అసలు విజయ్ సిద్ధాంతం ఏమిటి అనేది అర్థం కావడం లేదు. బహుశా ఆయన పూర్తి స్థాయిలో గ్రౌండ్ లోకి దిగిన తర్వాత జనాలకు విజయ్ పార్టీ పై ఒక స్పష్టమైన అవగాహనా రావొచ్చు. ఇదే క్లారిటీ తో మాత్రం ఆయన వచ్చే ఏడాది ఎన్నికలలో పోటీ చేస్తే, 2019 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ కి ఎదురయ్యే పరిస్థితులే రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుందో. ప్రస్తుతం ఆయన ‘జన నాయగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇదే అతనికి చివరి చిత్రం. ఈ సినిమా తర్వాత ఆయన పూర్తి స్థాయి ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాలతో బిజీ కానున్నాడు.
Also Read : శుభాకాంక్షలు తెలియజేయడం లో కూడా రాజకీయమేనా..? తమిళ హీరో విజయ్ పై మండిపడుతున్న అభిమానులు!