Balineni Srinivas Reddy: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పై( YSR Congress party chief Jagan Mohan Reddy ) అనేక రకాల విమర్శలు ఉన్నాయి. భారీ అక్రమ సంపాదన ఉన్నట్లు ప్రచారంలో ఎప్పటినుంచో ఉంది. అయితే తాజాగా ఒక విషయం బయటపడింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడైన ఓ నేత తన ఆస్తులను బలవంతంగా లాక్కున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా తన వియ్యంకుడి ఆస్తులను సైతం లాక్కున్నారని చెప్పుకొచ్చారు సదరు మాజీ మంత్రి. దీంతో జగన్మోహన్ రెడ్డి పై ఈ చీకటి కోణం బయటపడింది. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడైన నేత ఆరోపణలు చేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో సైతం విస్తృత ప్రచారం సాగుతోంది. జనసేన ప్లీనరీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read: కేసీఆర్ ప్రాణాలకు వారితోనే ముప్పు.. అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం సంచలన ప్రకటన!
* జగన్మోహన్ రెడ్డికి బంధువు..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి( balineni Srinivasa Reddy ) మొన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కూడా. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనను.. విస్తరణలో భాగంగా తొలగించారు జగన్మోహన్ రెడ్డి. అప్పటినుంచి పార్టీతో పాటు అధినేత తీరును ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేనలో చేరారు. తాజాగా జనసేన ప్లేనరీలో మాట్లాడిన బాలినేని జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కారణంగా తనతో పాటు తన కుటుంబం పడిన కష్టాలను చెప్పుకొచ్చారు. ఆ కష్టాల గురించి చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.
* అమ్మవారి సాక్షిగా..
అయితే పిఠాపురం( Pithapuram ) అమ్మవారి సాక్షిగా నిజం చెబుతున్నానని బాలినేని చెప్పడం సంచలనంగా మారింది. నాకు జరిగిన అన్యాయం ఒక్క రోజులో చెబితే సరిపోదు. మా నాన్న ఇచ్చిన ఆస్తిలో సగానికి పైగా అమ్ముకున్నాను. లెక్క చేయలేదు. జగన్నా ఆస్తులను కాజేశారు. ఆ ఉక్రోషం, బాధ నాకు, నా కుటుంబానికి మాత్రమే తెలుసు అంటూ కన్నీటిని దిగమింగుతూ మాట్లాడారు. నాలుగేళ్ల పదవి ఉండగానే వదిలేసి జగన్ వెంట అడుగులు వేశా. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. అందుకే ఈ విషయం చెబుతున్నాను అంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.
* రెబల్ గా మారిన సమయంలో..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీలో ఒక వెలుగు వెలిగారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అయితే విస్తరణలో పదవి కోల్పోయేసరికి తనలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అసహనానికి గురై రెబల్ గా మారారు. ఆ సమయంలోనే బాలినేని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అత్యంత సన్నిహితుడని కూడా చూడకుండా.. కేవలం తనకు వ్యతిరేకంగా మాట్లాడాడని ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలినేనికి చెందిన ఆస్తులను కొట్టేసినట్లు ప్రచారం నడుస్తోంది. తాజాగా బాలినేని ఆవేదన వెనుక ఇంత ఎపిసోడ్ నడిచినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా బాలినేని వియ్యంకుడు ఆస్తిని సైతం జగన్మోహన్ రెడ్డి కొట్టేసారని ఆరోపణలు చేయడం మాత్రం సంచలనం రేకెత్తిస్తోంది.