CM Revanth Reddy: సోషల్ మీడియా వినియోగం అధికంగా పెరగడంతో.. రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం దానిని వాడుకుంటున్నారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారు. కొంతమంది వ్యక్తులను స్వీయ జర్నలిస్టులుగా పేర్కొంటూ.. వారితో పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ నడిపిస్తున్నారు. ఇందులో ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదు. అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. గిట్టని నాయకుల మీద బురద చల్లించడం.. అడ్డగోలుగా విమర్శలు చేయించడం.. వ్యక్తిత్వ హనానికి పాల్పడటం సర్వసాధారణంగా మారిపోయింది.. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయించడం.. ఇష్టానుసారంగా విమర్శలు చేయించడం..ఉచ్చ నీచాలు లేకుండా మాట్లాడటం పరిపాటిగా మారిపోయింది. ఇది ఎంతవరకు దారి తీస్తుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే పరిస్థితి బాగోలేదు. ఏ మాత్రం బాగోలేదు. బాగుపడుతుందనే నమ్మకం కూడా లేదు.
Also Read: అధికారం, ఆదాయం లేకుంటే ప్రతిపక్షం నిద్రపోతుందా?: సీఎం రేవంత్ సూటి ప్రశ్నలు
ఐడెంటిటీ క్రైసిస్
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి రజతోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రారంభం నుంచి వీరోధి కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కెసిఆర్ మాట్లాడిన మాటల్లో.. చేసిన విమర్శలలో.. ఎక్కడా కూడా రేవంత్ పేరు ప్రస్తావించలేదు. అయితే ఇదే విషయాన్ని భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం మరో విధంగా ప్రచారం చేస్తోంది. కెసిఆర్ గుర్తుంచుకునే స్థాయి రేవంత్ రెడ్డిది కాదని.. రేవంత్ రెడ్డి కెసిఆర్ స్థాయికి దగ్గర నాయకుడు కాదని.. భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నవారు చెబుతున్నారు. యూట్యూబ్లో రకరకాలుగా వీడియో కట్స్ రూపొందించి.. తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. అడ్డగోలుగా విమర్శలు చేస్తూ.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. అయితే ఇందులో భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీ అనుకూల సోషల్ మీడియా విభాగం కూడా ఇలానే ఉంది. మొత్తంగా చూస్తే రాజకీయ నాయకులకు అనుకూలంగా వారు పని చేయడం.. అడ్డగోలుగా విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. కెసిఆర్ పేరు ప్రస్తావించేంత సీన్ రేవంత్ రెడ్డికి లేదని భారత రాష్ట్రసమితి నాయకులు.. రేవంత్ రెడ్డి పేరు చెప్తే కేసీఆర్ భయపడిపోతున్నారని కాంగ్రెస్ నాయకులు.. ఇలా సోషల్ మీడియాలో పరస్పరం విమర్శలు చేసుకోవడం విశేషం. రాజకీయాలు రాజకీయాల లాగే ఉంటే బాగుండేది. కానీ నాయకులు సోషల్ మీడియా లోకి రాజకీయాలను లాగడంతో వివాదాలు చెలరేగుతున్నాయి. దీనికి తోడు స్వయం ప్రకటిత జర్నలిస్టులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది.. అసలు జర్నలిజంతో సంబంధం లేకుండా.. జర్నలిజం చేయకుండా.. వాగడంబరం తోనే కొంతమంది పాత్రికేయుల ముసుగు వేసుకోవడం.. పరిస్థితిని మరింత అద్వానంగా మార్చుతోంది.
Cheap minister suffering from Identity crisis, hope he gets better soon. pic.twitter.com/zauY9geZ21
— Harish Reddy (@HarishBRSUSA) April 30, 2025
Also Read: నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. కారణం అదే