Government Education : రాష్ట్రంలో ప్రభుత్వ విద్య ( Government education) తీరు మారింది. గతంలో ఇంగ్లీష్ విద్య ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. అనర్గళంగా మాట్లాడుతూ కార్పొరేట్ విద్యార్థులకు తీసుకొని విధంగా సమాధానాలు చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆశ్చర్యపోయేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. ఇందుకు కృష్ణా జిల్లా ముప్పాళ్ళ గురుకుల బాలికల పాఠశాల వేదిక అయింది. చంద్రబాబు మనసును దోచుకునే విధంగా అక్కడి విద్యార్థులు ఉండడం విశేషం. అయితే ఇదంతా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటుంది.
Also Read : చంద్రబాబు పి4కి రూ.10 కోట్లు.. ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే
* ముప్పాళ్ళ లో ప్రత్యేక కార్యక్రమం..
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కృష్ణాజిల్లా ముప్పాళ్ళలో( Krishna district) ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముప్పాళ్ళలోని గురుకుల బాలిక పాఠశాలకు వెళ్లారు చంద్రబాబు. వారితో ముచ్చటించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను పరిశీలించారు. వారి నుంచి సమాధానాలు రాబట్టారు. చంద్రబాబు తెలుగులో ప్రశ్నిస్తుంటే విద్యార్థులు మాత్రం ఇంగ్లీషులో సమాధానం చెబుతూ ఆశ్చర్యపరిచారు. అయితే విద్యార్థులు మాట్లాడినంత సేపు కనీసం చంద్రబాబు ఇంగ్లీషులో మాట్లాడలేదు. దీనినే హైలెట్ చేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధించడం వల్లే వారు అలా అనర్గళంగా మాట్లాడుతున్నారని చెబుతోంది.
* విద్యార్థులతో మమేకం..
మరోవైపు ముప్పాళ్ళ పర్యటనలో చంద్రబాబు( CM Chandrababu) విద్యార్థులతో మమేకం అయ్యారు. గతానికి భిన్నంగా వ్యవహరించారు. కూల్ కూల్ గా మాట్లాడుతూ వారితో సరదాగా గడిపారు. విద్యార్థులతో కలిసి తేనేటి విందు చేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల విద్యా బోధన, వసతుల గురించి ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి నుంచి సమాధానాలు రాబెట్టారు. అయితే ఇక్కడ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన మంచి పనులు అంటూ ప్రచారం చేస్తోంది. నాడు నేడులో భాగంగా పాఠశాల భవనాల పనులు పూర్తయ్యాయని చెబుతూ.. ఇదంతా జగన్ పుణ్యమని.. చంద్రబాబు చేసింది కాదని చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఇదే వైరల్ అంశంగా మారింది.
CM Chandra Babu Shocked Over Government Students Speech In English!
జగన్ దెబ్బకు చంద్రబాబు షాక్! pic.twitter.com/Kigc043xWe
— (@YSJ2024) April 6, 2025