Hostel Warden Jobs: వార్డెన్‌ పోస్టుల పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఎప్పటి నుంచంటే..!

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీఆర్‌టీ) విధానంలో నిర్దేశించిన సంఖ్యలో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది.

Written By: Raj Shekar, Updated On : June 17, 2024 2:08 pm

Hostel Warden Jobs

Follow us on

Hostel Warden Jobs: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో 581 పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) విడుదల చేసింది. వార్డెన్లు, మాట్రన్, లేడీ సూపర్‌వైజర్‌ పోసుల భర్తీకి జూన్‌ 24 నుంచి 29 వరకు పరీక్షలు జరుగతాయని వెల్లడించింది.

ఆన్‌లైన్‌లో పరీక్ష..
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీఆర్‌టీ) విధానంలో నిర్దేశించిన సంఖ్యలో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. నార్మలైజేషన్‌ విధానంలో మార్కుల లెక్కింపు ఉంటుందని వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్‌ – 1(జనరల్‌ స్టడీస్‌), మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఈడీ స్థాయిలో విద్యాపై పేపర్‌–1 పరీక్ష ఉంటుందని వివరించింది. దివ్యాంగ వసతి గృహాల్లో పోస్టులకు పేపర్‌–2 పరీక్షలో డిప్లొమా స్పెషల్‌ ఎడ్యుషన్‌(దృష్టిలోపం, వినికిడి లోపం) సబ్జెక్టుపై ప్రశ్నలు ఉంటాయని తెలిపింది.

21 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు..
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాల్‌ టికెట్లను జూన్‌ 21 నుంచి వెబ్‌సైట్‌లో ఉంచుతామని తెలిపింది. కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. హాల్‌ టికెట్‌పై మూడు నెలల్లో తీసుకున్న పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో అంటించాలని సూచించింది. పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపుకార్డు(ఒరిజినల్‌) తీసుకురావాలని సూచించింది.

ఈ పోస్టులు భర్తీ..
ఇదిలా ఉండగా టీజీపీఎస్సీ భర్తీ చేసే 581 ఉద్యోగాల్లో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆషీసర్‌ గ్రేడ్‌–1, హాస్టర్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–, వార్డెన్‌ గ్రేడ్‌ – 1, గ్రేడ్‌ – 2, మాట్రన్, గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, లేడీ సూపరింటెండెంట్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.