https://oktelugu.com/

Telangana New Secretariat: అంతా ఆరు నిమిషాల్లోనే.. కొత్త సెక్రటేరియేట్‌కు కేసీఆర్‌ శని దోషం పోగొడతారా?

కొత్త సచివాలయం ప్రారంభోత్సవం విషయంలోనూ కేసీఆర్‌ ఆరునే నమ్ముకున్నారు. ఆరు నిమిషాల్లో కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ నెల 30న మధ్యాహ్నం 1.58 నుంచి ప్రారంభించి 2.04 నిమిషాల్లో పూర్తి చేయాలని అధికారికంగా ఆదేశించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 26, 2023 11:33 am
    Follow us on

    Telangana New Secretariat: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లక్కీ నంబర్‌ ఆరు. ఈ విషయం అందరికీ తెలుసు. ఆయన ఏం చేసినా ఆరు కలిసి వచ్చేలా చేసుకుంటారు. సెక్రటేరియేట్‌కు వెళ్లకుండానే 9 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌ ఈనెల 30న కొత్త సెక్రటేరియేట్‌లో అడుగుపెట్టబోతున్నారు. పాత సెక్రటేరియేట్‌లో అడుగు పెడితే కేసీఆర్‌కు ప్రాణగండం ఉందని ఎవరో జ్యోతిష్యులు చెప్పారట. ఈ విషయం అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే కేసీఆర్‌ పాత సెక్రటేరియేట్‌లో అడుగు పెట్టలేదు. దానిని తొలగించి వాస్తు, శని దోషం పోయేలా ఇంధ్ర భవనాన్ని తలపించేలా పాలనా సౌధం నిర్మించుకున్నారు. మరో నాలుగు రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్త సచివాలయం ముహూర్తం కూడా ఆరు అంకె కలిసి వచ్చేలా చూసుకున్నారు. మరి దీంతో అయినా కేసీఆర్‌ జోతిష్యుడు చెప్పిన దోషం పోతుందా.. గండం తప్పినట్లేనా అన్న చర్చ జరుగుతోంది.

    1:58 నుంచి 2.04 నిమిషాల వరకు..
    ఇప్పుడు కొత్త సచివాలయం ప్రారంభోత్సవం విషయంలోనూ కేసీఆర్‌ ఆరునే నమ్ముకున్నారు. ఆరు నిమిషాల్లో కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ నెల 30న మధ్యాహ్నం 1.58 నుంచి ప్రారంభించి 2.04 నిమిషాల్లో పూర్తి చేయాలని అధికారికంగా ఆదేశించారు. ఈ ఆరు నిమిషాల్లో తమకు కేటాయించిన కార్యాలయాల్లో అధికారులు ఆసీనులై ఒక్క ఫైల్‌పై సంతకం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బీఆర్‌కే భవన్‌ సహా ఇతర చోట్ల ఉన్న కార్యాలయాల్లో ఫైల్స్‌ను కొత్త సచివాలయంలోకి తరలిస్తున్నారు. మూడురోజుల్లో మొత్తం పూర్తయిపోతుంది.

    ఇక కొత్త సచివాలయం నుంచే పాలన
    వచ్చే సోమవారం నుంచి ఇక పాలన మొత్తం కొత్త సచివాలయం నుంచే జరుగుతుంది. ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖల చొప్పున కేటాయించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్లో హోమ్‌ శాఖ, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ ఉండబోతున్నాయి. మూడో ఫ్లోర్‌లో అగ్రికల్చర్‌ – ఎస్సీ డెవలప్మెంట్‌ శాఖలకు కేటాయించారు. నాలుగో అంతస్తులో ఇరిగేషన్‌ అండ్‌ లా, ఐదో అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్‌లో సీఎం, సీఎస్‌ కు కేటాయింపులు చేశారు. ఈ మేరకు శాఖల వారిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

    ప్రారంభోత్సవాలకు ఆహ్వానం..
    30వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించి, అదేరోజు ఉదయం కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం చేయనున్నట్టు సమాచారం. దీనికిగాను అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ సీఎం కేసీఆర్‌ సెంటిమెంట్‌ ప్రకారమే నిర్వహించనున్నారు. మరోవైపు అధికారులు అధికారులు, ప్రజాప్రతినిధులు, సెక్రెటరీలకు ప్రొటోకాల్‌ ప్రకారం ఆహ్వానం పంపుతున్నారు.