Financial Problems: ఆర్థిక ఇబ్బందులు తీరే మార్గమేంటో తెలుసా?

ఇంటికి దిష్టి పోవాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి. ఇందులో భాగంగా ఓ కొబ్బరికాయను తీసుకుని దానికి నల్లని కాటుక పెట్టాలి. తరువాత దీన్ని మన చుట్టూ తిప్పుకుని అనంతరం ఇంటి చుట్లూ తిప్పాలి. దాన్ని పారే నీళ్లలో పడేయాలి. దీనివల్ల మనకు ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి.

Written By: Srinivas, Updated On : April 26, 2023 11:51 am
Follow us on

Financial Problems: ప్రస్తుత రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. ఎంత సంపాదించిన ఖర్చులు చాలడం లేదు. ఇది ప్రస్తుతం అందరి నోట వినిపిస్తున్న మాట. దీనికి కారణం మన సంపాదన పెరగకపోవడమే. ఈనేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు. కొందరు వాస్తు ప్రభావమని సరిపెట్టుకుంటున్నా కొందరు మాత్రం ఏవో పరిహారాలు చేయాలని చూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి చాలా రకాల చర్యలు తీసుకుంటున్నారు.

ఈనేపథ్యంలో ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి పలు ఉపాయాలు పడాల్సి వస్తోంది. అయినా సమస్య కొలిక్కి రావడం లేదు. దీంతో ఇప్పుడు ధరల పెరుగుదల వల్ల కూడా డబ్బులు సరిపోవడం లేదు. కుటుంబ ఖర్చులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో డబ్బు సర్దుబాటు చేయడం ఇబ్బందిగానే మారుతోంది. దీనికి కొన్ని పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

ఇంటికి దిష్టి పోవాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి. ఇందులో భాగంగా ఓ కొబ్బరికాయను తీసుకుని దానికి నల్లని కాటుక పెట్టాలి. తరువాత దీన్ని మన చుట్టూ తిప్పుకుని అనంతరం ఇంటి చుట్లూ తిప్పాలి. దాన్ని పారే నీళ్లలో పడేయాలి. దీనివల్ల మనకు ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. దీన్ని పాటించి నరదిష్టి నుంచి బయట పడేస్తుందని నమ్ముతాం.

మనం పూజా కార్యక్రమాల్లో కొబ్బరికాయలను ఉపయోగిస్తాం. వ్రతాలు చేసినా కొబ్బరికాయలను కొడతాం. ఇలా కొబ్బరికాయతో మనకు అవినాభావ సంబంధం ఉంది. శుక్రవారం లక్ష్మీదేవికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లిస్తాం. ఇలా కొబ్బరికాయలతో మనం ఎన్నో దైవ కార్యక్రమాలు చేపడతాం. ఇందులో దీంతో దిష్టి తీసుకోవడం కూడా ఒకటి. ఇలా చేయడం వల్ల మనకు అనేక లాభాలుంటాయని విశ్వసించాలి.