HomeతెలంగాణCharminar: ఊడిపడిన చార్మినార్‌ పెచ్చులు.. మరమ్మతులు చేసినచోటే మళ్లీ..!

Charminar: ఊడిపడిన చార్మినార్‌ పెచ్చులు.. మరమ్మతులు చేసినచోటే మళ్లీ..!

Charminar: చార్మినార్‌.. హైదరాబాద్‌(Hyderabad) ఐకానిక్‌ నిర్మాణం. 450 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ పటిష్టంగా ఉంది. హైదరాబాద్‌ అంటే ఒకప్పుడు అందరికీ గుర్తొచ్చేది ఈ నిర్మాణమే. నిజాంలు నిర్మించిన ఈ కట్టడానికి అక్కడక్కడా డ్యామేజీ జరిగింది. అయితే వాటికి మరమ్మతుల చేశారు.

Also Read: కంచ గచ్చిబౌలి భూముల ఫోటో.. ఫోటోగ్రాఫర్ కు కాంగ్రెస్ నేత బంపర్ ఆఫర్!

హైదరాబాద్‌లోని చారిత్రాత్మక స్మారకం చార్మినార్‌(Charminar)కు సంబంధించిన ఒక ఆందోళనకర సంఘటన జరిగింది. చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటంతో పర్యాటకుల్లో భయాందోళన నెలకొంది. భాగ్యలక్ష్మి ఆలయం(Bhagya Laxmi Temple) వైపు ఉన్న భాగంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలో మరమ్మతులు జరిగిన చోటే మళ్లీ పెచ్చులు ఊడిపడటం గమనార్హం. అదృష్టవశాత్తూ, ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ఊడిపోయిన పెచ్చులను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) సిబ్బంది తొలగించి శుభ్రం చేశారు. చార్మినార్‌కు మరోసారి మరమ్మతులు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఘటన చార్మినార్‌ నిర్వహణపై పలు ప్రశ్నలను లేవనెత్తింది.

వర్ష బీభత్సంతోనే..
హైదరాబాద్‌ నగరంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం(మార్చి 3న) మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు ఏరులై పారింది. పంజాగుట్ట–ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి నిల్వ కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెర్క్యూరీ హోటల్‌(Merqury Hotle) సమీపంలో ఒక కారుపై చెట్టు కూలిపోయిన ఘటన కూడా చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు.

ఒకేరోజు రెండు ఘటనలు..
ఈ రెండు సంఘటనలు హైదరాబాద్‌ నగరంలో ఒకే రోజు జరగడం ఆందోళన కలిగించింది. చార్మినార్‌ వంటి చారిత్రక కట్టడాల సంరక్షణ, నగరంలో వర్షపు నీటి నిర్వహణపై అధికారులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వర్షం కారణంగా రోడ్లు మునిగిపోవడం, చెట్లు కూలిపోవడం వంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చార్మినార్‌ మరమ్మతులు త్వరగా పూర్తి చేసి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version