Homeఅంతర్జాతీయంTrump Tariff: భారత ఫార్మా పరిశ్రమకు ఊరట.. అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక పరిణామం

Trump Tariff: భారత ఫార్మా పరిశ్రమకు ఊరట.. అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక పరిణామం

Trump Tariff: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రపంచ దేశాలపై టారిఫ్‌(Tariff)ల మోత మోగించారు. భారత్‌పైనా 26 శాతం టారిఫ్‌ విధించారు. ఈమేరకు బుధవారం(ఏప్రిల్‌ 2న) ప్రకటన చేశారు. అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని తెలిపారు. దీంతో గురువారం భారత మార్కెట్లు(Indian Stack Markets) నష్టాలతో మొదలయ్యాయి. అయితే తాజాగా ఫార్మారంగానికి ట్రంప్‌ ఊరటనిచ్చారు.

Also Read: కంచ గచ్చిబౌలి భూముల ఫోటో.. ఫోటోగ్రాఫర్ కు కాంగ్రెస్ నేత బంపర్ ఆఫర్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)ఇటీవల విదేశీ ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తూ ‘టారిఫ్‌ బాంబు’ పేల్చారు. భారత ఉత్పత్తులపై 26 శాతం, చైనా(China)పై 34 శాతం, వియత్నాం(Viyatnam)పై 46 శాతం వంటి రేట్లతో సుంకాలు ఖరారు చేశారు. అయితే, భారత ఔషధ పరిశ్రమ(India Farma Industree)కు ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అమెరికాలో వినియోగించే జనరిక్‌ ఔషధాల్లో 40 శాతం కంటే ఎక్కువ భారత్‌లో తయారవుతాయి. ఈ నేపథ్యంలో సుంకాలు విధిస్తే అమెరికాలో ఔషధ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందనే ఆందోళనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఫార్మాకు ఊరట..
ఈ మినహాయింపు భారత ఔషధ ఎగుమతుల(Drug exports)కు పెద్ద ఊరటనిస్తుంది. అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భారత జనరిక్‌ మందుల కీలక పాత్రను ఈ నిర్ణయం హైలైట్‌ చేస్తోంది. అదే సమయంలో, ఇతర రంగాల్లో భారత ఎగుమతులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా(America) సుంకాలకు ప్రతిగా భారత్‌ యూఎస్‌ వస్తువులపై సుంకాల్లో సవరణలు చేస్తే, వాణిజ్య అడ్డంకులు తొలగి ఏటా 5.3 బిలియన్‌ డాలర్ల అదనపు ఎగుమతులు సాధ్యమవుతాయని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది రెండు దేశాల మధ్య సమతుల్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయవచ్చు.

ఇతర దేశాలపై ప్రభావం..
మరోవైపు, ట్రంప్‌ ప్రకటించిన సుంకాలు ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌పై 20 శాతం, జపాన్‌పై 24 శాతం, తైవాన్‌పై 32 శాతం సుంకాలతో పాటు ఆటోమొబైల్‌(Auto Mobile) దిగుమతులపై 25 శాతం టారిఫ్‌ విధిస్తున్నారు. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ సీనియర్‌ అధికారులు ఈ సుంకాల ప్రభావాన్ని సమీక్షిస్తూ వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఏప్రిల్‌ 2ని ‘విముక్తి దినం’గా ట్రంప్‌ ప్రకటించినప్పటికీ, భారత ఫార్మా రంగానికి ఈ మినహాయింపు ఒక విజయంగా చెప్పవచ్చు. ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారానికి కొత్త దిశను చూపుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version