Chandrababu Nayudu : నటుడు నందమూరి తారాకరామారావు 1983లో స్థాపించినపార్టీ తెలుగు దేశం. తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో పార్టీని స్థాపించి కేవలం నాలుగు నెలల్లోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి అయ్యారు. మూడు పర్యాయాలు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయా‍్యరు. ఆయన నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న నారా చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు చెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవలే ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, తెలంగాణలో కూడా తన శిష్యుడు రేవంత్‌రెడ్డి సీఎంగా ఉడడంతో ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టారు. విభజన సమస్యలపై చర్చించేందుకు ఇటీవల తెలంగాణకు వచ్చిన సీబీఎన్.. ప్రజాభవన్‌లో విభజన సమస్యలపై తెలంగాణ సీఎంతో చర్చించారు. మరుసటి రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ నేతలతో సమావేశమయ్యారు. పారీ‍్ట బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. చేరికలపై దృష్టిపెట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇక తాజాగా ఆదివారం కూడా టీటీడీపీ నేతలతో మరోమారు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీపీలో ప్రస్తుతం ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు తెలిపారు.
పూర్వ వైభవం తెచ్చేలా..
తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పూర్వవైభవం సాధించడమే లక్ష్యంగా టీటీడీపీ నేతలు, కార్యకర్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆదివారం(ఆగస్టు 25న)నేతలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న టీడీపీ కమిటీలను రద్దు చేశారు. ఇకపై అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సభ్యత్వాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నేతలకు సూచించారు. సభ్యత్వాలను పెద్ద ఎత్తున నమోదు చేయించిన నేతలకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.
తెలుగువారి కోసం పుట్టిన పార్టీ..
తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం, సంక్షేమం కోసం పుట్టిన పార్టీ అని చంద్రబాబు నాయుడు తెలిపారు. తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లవంటివని.. రెండు ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలనేదే టీడీపీ అభిమతమని పేర్కొన్నారు. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయినా.. గ్రామాల్లో పారీ‍్టకి బలమైన క్యాడర్ ఉందన్నారు. క్యాడర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. నేతలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీటీడీపీ నూతన అధ్యక్షుడిపైనా చర్చ జరిగినట్లు సమాచారం.
పాత కమిటీల రద్దు..
టీటీడీపీ ప్రక్షాళనలో భాగంగా చంద్రబాబు గతంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ టీడీపీలో పాత కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయించారు. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా ఉన్న కమిటీలను రద్దు చేశారు. ఏపీ, తెలంగాణలో ఒకేసారి కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాతే తెలంగాణ అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీని బలోపేతం కోసం ఇకపై ప్రతీనెల రెండు రోజులు రాష్ట్రానికి వస్తానని నేతలకు తెలిపారు.