KTR New Look: కేటీఆర్ అనగానే నీట్ గా షేవింగ్ చేసుకుని.. కాటన్ షర్టు, డెనిమ్ ప్యాంట్ వేసుకున్న ఓ సింపుల్ పర్సన్ గుర్తుకు వస్తారు. యువకుడిగా ఉన్నప్పుడు గడ్డాలు, మీసాలతో ఉన్న కేటీఆర్.. అమెరికా వెళ్ళిన తర్వాత పూర్తిగా మారిపోయారు. తన మేకోవర్ పూర్తిగా మార్చేశారు. తన తండ్రి లాగానే నీట్ గా గడ్డం గీసుకోవడం ప్రారంభించారు. మీసాలు కూడా లేకుండా ఒక డిఫరెంట్ మేనరిజంతో కనిపించడం ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం నుంచి పురపాలక శాఖ మంత్రి అయ్యేదాకా కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. చివరికి అమెరికాకు, దావోస్ కు పెట్టుబడుల సమావేశానికి వెళ్లే ముందు కూడా ఇలానే ఉండేవారు. కాకపోతే అక్కడ స్టైల్ కు అనుగుణంగా సూటు బూటు ధరించేవారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్.. ఇటీవల ఒక చిత్రాన్ని పంచుకున్నారు. అందులో ఆయన లుక్కు చాలా డిఫరెంట్ గా అనిపించింది.
కేటీఆర్ పోస్ట్ చేసిన ఆ ఫోటోలో ఆయన పెరిగిన జుట్టు, మీసాలు, గడ్డంతో కనిపించారు. ఎప్పుడో యువకుడిగా ఉన్నప్పుడు కెసిఆర్ అలా ఉండేవారు. అని అకస్మాత్తుగా ఆయన అలా కనిపించేసరికి ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితి నాయకులు ఆశ్చర్యపోయారు. నెటిజన్లు కూడా ఏంటి ఈయన కేటిఆరేనా అనే సందేహం వ్యక్తం చేశారు. అయితే దీనికి ఒక ఆశ్చర్యకరమైన కామెంట్ ను కేటీఆర్ జోడించారు. ఒకవేళ నేను గడ్డం మీసాలు పెంచితే ఇలా ఉంటానేమో.. అని రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని భారత రాష్ట్ర సమితి శ్రేయోభిలాషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించి తనకు పంపించారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రాన్ని కేటీఆర్ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది..
పెరిగిన గడ్డం, మీసాలు, జుట్టుతో కేటీఆర్ కనిపించడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సినిమా హీరోలాగా ఉన్నారంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కొందరేమో ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత.. క్యాడర్లో సానుకూల దృక్పథాన్ని పెంచేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారని.. ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన ఫోటో కూడా అలాగే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ కం బ్యాక్ కావాలంటే పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయాలని.. కేటీఆర్ పోస్ట్ చేసిన ఫోటో కూడా పాజిటివిటీని పెంచే విధంగా ఉందని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. కాగా కేటీఆర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.
View this post on Instagram