Modi Biopic: కొందరు నేతలు ప్రజల మనుసులో చిరకాలం నిలిచిపోతుంటారు. వారు మరణించినా కూడా వారు చేసిన సేవలను మర్చిపోరు. ఆ రేంజ్ లో అభిమానులు ఉంటారు. ఎన్టీఆర్ సజీవంగా ఉన్న సందర్బంలో ఆయన ఎంతో మంది అభిమానులను సంపాదించారు. ఆయనే కాదు వై.ఎస్సాఆర్ కూడా ఊహించని రేంజ్ లో అభిమానులను సంపాదించారు. అయితే ప్రస్తుతం అదే రేంజ్ లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈయన బయోపిక్ తీస్తున్న సంగతి తెలిసిందే.
గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి భారతదేశ ప్రధానిగా రెండు సార్లు దేశ ప్రజల హృదయాలను కొల్లగొట్టిన భారతీయ నేత నరేంద్ర మోదీ. వరుసగా రెండు సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. ముచ్చటగా మూడో సారి భారత దేశ పాలనా పగ్గాలు చేతబడుతారు అంటూ సర్వేలు చెబుతున్నాయి. కానీ ఈ విషయం కొన్ని రోజులు అయితే గానీ తెలియదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ సినిమాకు టైటిల్ ఏంటనే క్యూరియాసిటీ చాలా మందిలో నెలకొంది. ఎట్టకేలకు ఈ సినిమా పేరును ప్రకటించారు మేకర్స్.
విశ్వనేత పేరుతో అన్ని భారతీయ భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాకు సి.హెచ్. క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తే.. వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో పోషించనున్నారు. ఇక ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కుమారుడు అవార్డు గ్రీహీత కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, డిమోనిటైజేషన్, జి.ఎస్.టి, జి.ఎస్.టి, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సాహసోపేత సంచలనాల నిర్ణయాలతో భారతీయులు గుండెల్లో నిలిచారు.
యూనిఫామ్ సివిల్ కోడ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, మెజారిటీ ప్రజల మెడపై కత్తి లా వేలాడుతున్న అనేక దుష్ట చట్టాలను నిర్మూలించే దిశగా ప్రధాని అడుగులు వేస్తున్నారు. అయితే నరేంద్ర మోదీ బయోపిక్ లో చాయ్ వాలా స్థాయి నుంచి విశ్వ నేతగా ఎలా ఎదిగారు? ఆయన మహాప్రస్థానం ఎలా కొనసాగింది వంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో రానుంది సినిమా. మరి చూడాలి సినిమా ఏ విధంగా అలరిస్తుందో..