BRS Party Defeat: సరిగా 2014లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది భారత రాష్ట్ర సమితి. 2023 లో కూడా ఇదే జోరు చూపించింది. 2014 కంటే 2023లో ఇంకా సీట్లు ఎక్కువ సాధించింది. లోకల్ బాడీ ఎలక్షన్లలో దుమ్ము రేపింది. వరంగల్ నుంచి మొదలుపెడితే నాగార్జునసాగర్ వరకు జరిగిన ప్రతి ఉప ఎన్నికలో కూడా అదరగొట్టింది. హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాస్త ఇబ్బంది పడింది. ఒకరకంగా ఎటువంటి ఎన్నిక జరిగిన సరే తమదే విజయం అన్నట్టుగా గులాబీ పార్టీ ఒక బెంచ్ మార్క్ సృష్టించింది. సొంత మీడియాను ఏర్పరచుకుంది. బలమైన సోషల్ మీడియాను నిర్మించుకుంది. ఇక నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి స్వల్ప మెజారిటీతోనైనా అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ భారత రాష్ట్ర సమితి ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి భారత రాష్ట్ర సమితి చేయని ప్రయత్నాలు అంటూ లేవు. దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్వీయ తప్పిదాలను చేసింది. అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు.. మంత్రుల నిర్లక్ష్యం.. ప్రభుత్వపరంగా జరిగిన తప్పులను గులాబీ పార్టీ తీవ్రంగా ఎండ కట్టింది. ఈ విషయాలను ప్రజలలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. అంతేకాదు పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీ బాస్ కెసిఆర్ రంగంలోకి దిగారు. నేరుగా ప్రచారం చేశారు. తెలంగాణలో ఉన్న అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితిని తెలంగాణ ప్రజలు నమ్మలేదు.. ఆ పార్టీ చరిత్రలో తొలిసారిగా 0 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. ఒక రకంగా ఆ పార్టీకి అత్యంత దారుణమైన పరాభవం అది. ఈ ఓటమి తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి పరాభవం ఎదురయింది.
ఇలా వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోవడంతో భారత రాష్ట్ర సమితి కార్యవర్గం ఒకరకంగా డీలా పడిపోయింది. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కనీ విని ఎరుగని స్థాయిలో ప్రచారం చేసింది. మీడియాను వాడుకుంది. సోషల్ మీడియాను వినియోగించుకుంది.. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితికి అనుకూల ఫలితం రాలేదు. పోలింగ్ కు మరో మూడు రోజులు ఉందనగా భారత రాష్ట్ర సమితి ఊహించని విధంగా వెనుకబడిపోయింది.. కాంగ్రెస్ పార్టీ దూసుకు వచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. భారత రాష్ట్ర సమితి తీవ్రమైన పోటీ ఇచ్చినప్పటికి చివరి దశలో చేతులెత్తేసింది. అసెంబ్లీ నుంచి మొదలుపెడితే జూబ్లీహిల్స్ వరకు ప్రతి ఎన్నికలోనూ గులాబీ పార్టీకి వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ తిరిగి మళ్ళీ టాప్ గేర్ లోకి వస్తుందా.. తెలంగాణలో మళ్లీ చక్రం తిప్పుతుందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.