Jubilee Hills Bypoll Counting: జూబ్లీహిల్స్ ఎన్నికల సంబంధించి వెల్లడైన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీత మీద ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి కంచుకోటగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మూడు రంగుల జెండా ఎగరడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఇది తమ కష్టానికి తగిన ఫలితం అని పేర్కొంటున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ.. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని కలిగించిన బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమిపాలైంది. దాదాపు 200కు పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ రాష్ట్రంలో ఆర్ జె డి తో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమైంది. పైగా సీట్ల కేటాయింపులో అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ కొంతమంది కార్యకర్తలు దాడి చేశారు. ఇటువంటి సంఘటనలు అనేకం జరగడంతో బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓటర్లు పెద్దగా నమ్మలేదు. చరిత్రలో తొలిసారిగా సింగిల్ డిజిట్ స్కోర్ కే ఆ పార్టీని పరిమితం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి రాహుల్ గాంధీ నాయకత్వంపై చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పలు న్యూస్ చానల్స్ డిబేట్ కార్యక్రమాలు నిర్వహించాయి. ఇక తెలుగు మీడియాలో ప్రముఖ న్యూస్ ఛానల్ 10టీవీ డిబేట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చెన్నమనేని కళ్యాణ్ వ్యవహరించారు. బిజెపి నుంచి సోలంకి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నుంచి బల్మూరి వెంకట్ ఈ డిబేట్ కార్యక్రమానికి హాజరయ్యారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి గురించి కళ్యాణ్ ప్రస్తావించగా.. దానికి శ్రీనివాస్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇదే క్రమంలో వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరు నాయకులు రాయడానికి వీలు లేని భాషలో తిట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కళ్యాణ్ వారిస్తున్నప్పటికీ ఇద్దరు నేతలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో డిబేట్ కార్యక్రమం కాస్త రచ్చ రచ్చ అయిపోయింది. ఓవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు విడుదలవుతుండగానే.. వీరిద్దరు నేతలు ఇలా కొట్టుకోవడం సంచలనం కలిగించింది..
ఇక ఇటీవల కాలంలో ఓ భారత రాష్ట్ర సమితి నాయకుడు దాడి చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాయపడ్డాడు. ఆ తర్వాత ఆయన పాల్గొని డిబేట్ కార్యక్రమాలకు తలకు హెల్మెట్ పెట్టుకుని వచ్చాడు. తద్వారా తన నిరసనను వ్యక్తం చేశాడు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, బిజెపి కి చెందిన ఇద్దరు నాయకుల మధ్య వాగ్వాదం జరగడం.. అది భౌతికపరమైన దాడికి కారణం కావడంతో మరోసారి చర్చ మొదలైంది. అయితే ఈ ఘటనపై ఇంతవరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది.
లైవ్ డిబేట్ లో బూతులు తిట్టుకుంటూ తన్నుకున్న… బల్మూరి వెంకట్ vs సోలంకి శ్రీనివాస్.
— సర్ధార్ సర్వాయి పాపన్న (@kaloji2022) November 14, 2025