PM Modi Telangana Visit: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్ కాసేపట్లో మొదలు కానుంది. అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రావొచ్చన్న ప్రచారం నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ టూర్ ద్వారానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మోదీ సమరశంఖం పూరించబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పర్యటనకు ముందే.. ఈసారి తన పర్యటన మామూలుగా ఉండదు అన్నట్లుగా మోదీ రాష్ట్రంలో అడుగు పెట్టక ముందే ట్వీట్ ద్వారా ఓ ఇండికేషన్ ఇచ్చారు. ‘అసమర్థ బీఆర్‌ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు.. కాంగ్రెస్ పైనా ప్రజలు అంతే విసిగిపోయారు.. ఈ రెండు పార్టీలకు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేదు’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
అధికారిక పర్యటన.. అనంతరం సభ…
ప్రధాని మోదీ ఆదివారం తెలంగాణలో అధికారికంగా పర్యటిస్తున్నారు. మహబూబ్‌నగర్‌కు వస్తున్న మోదీ కి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు ఏర్పాట్లు చేశారు. మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్లకుపైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ, రైల్వేలతో సహా విభిన్నరంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.
ప్రధాని పర్యటన ఇలా
ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు ప్రధాని మోదీ. 1.35కి విమానాశ్రయం నుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 2.05 గంటలకు పాలమూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.15–2.50 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌లో సాయంత్రం 4.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడ్నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
కేసీఆర్ మళ్లీ డుమ్మా..
ఇక ప్రధాని పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కూడా డుమ్మా కొట్టారు. మోదీ పర్యటనకు తాను దూరంగా ఉంటున్నట్లు.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్వాగతం పలుకుతారని సీఎంవో నుంచి ప్రకటన విడుదల చేశారు. ప్రధాని పర్యట ఖరారు అయిన రోజు నుంచే సీఎం కేసీఆర్‌కు జ్వరం పట్టుకున్నట్లు ఉంది. ఈ విషయాన్ని ఆయన తనకుడు, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
కేసీఆర్‌కు దబిడి దిబిడే..
ట్వీట్ ద్వారా తన పర్యటన ఎలా ఉండబోతోందో ముందే చెప్పిన ప్రధాని మోదీ.. ఈసారి బీఆర్‌ఎస్ సర్కార్‌పై దాడి తప్పదని సంకేతం ఇచ్చారు. గతంలో ప్రధాని తెలంగాణ పర్యట సమయంలో ఎన్నడూ ఇలా ట్వీట్ చేయలేదు. ఈసారి మాత్రం పర్యటనకు ముందే విమర్శలు షురూ చేశారు. కాంగ్రెస్‌ను కూడా అర్సుకుంటారని తెలుస్తోంది. దీంతో పీఎం సభలో ఏం మాట్లాడతారు, ఎలాంటి విమర్శలు చేస్తారు.. కవిత గురించి ప్రస్తావిస్తారా.. స్కాంలు బయట పెడతారా.. అని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఉత్కంఠగా చూస్తున్నారు.