Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆయా రాశుల జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమ జీవతం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. శుక్రవారం ద్వాదశ రాశులపై అశ్వనీ నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఈ క్రమంలో వజ్ర యోగం ఏర్పడుంది. దీంతో మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
వ్యాపారులు భవిష్యత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. ఏదైనా పని మొదలు పెడితె కచ్చితంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల కోసం షాపింగ్ చేస్తారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృషభ రాశి:
సమాజలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థుల కెరీర్ పై తీసుకునే నిర్ణయాలు శుభప్రదంగా ఉంటాయి. వ్యాపారులు ఆర్థికంగా పుంజుకుంటారు.
మిథున రాశి:
ప్రియమైన వారి కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేయడంతో ప్రశంసలు ఉంటాయి.
కర్కాటక రాశి:
ఉద్యోగులకు అదనపు ఆదాయం ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు దక్కుతాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు.
సింహారాశి:
శుభకార్యాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణాల కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార నిమిత్త ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
కన్య రాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శారీరకంగా అలసిపోతారు. కొత్త పనులు చేపట్టే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. వ్యాపారులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది విజయవంతం అయ్యే అవకాశం.
తుల రాశి:
ఈ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఏ పని చేపట్టినా సక్సెస్ అవుతుంది. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృశ్చిక రాశి:
శత్రువుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం. అందువల్ల కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీపై ఆధిపత్యం చెలాయించడానికి కొందరు ప్రయత్నిస్తారు.
ధనస్సు రాశి:
వివాహ ప్రయత్నాలు సాగుతాయి. కుటుంబసభ్యులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. ఉాద్యోగులు అదనపు ఆదాయం పొందుతారు.
మకర రాశి:
ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. బంధువుల నుంచి ధన సాయం పొందుతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కుంభరాశి:
ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. వ్యాపరులు కొత్త ప్రణాళికలు వేస్తారు.
మీనరాశి:
ఆర్థిక పరిస్థితి అనుకున్న విధంగా ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా దానిని పూర్తి చేయండి. మధ్యలో వదిలేయడం ద్వారా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటారు.