MP Arvind
BJP MP Dharmapuri Arvind : బీజేపీ ఫైర్ బ్రాండ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. పార్టీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అధిష్టానం దృష్టిలో కూడా అర్వింద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించిన నేతగా తెలంగాణలో ఒక్కసారిగా షైన్ అయ్యారు అర్వింద్. తర్వాత కవితతోపాటు, కేసీఆర్, కేటీఆర్‌పై ఘాటైన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉంటున్నారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అర్వింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. నిజామాద్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో అర్వింద్ మాట్లాడుతూ.. ఎవరికి ఓటేసినా గెలిచేది బీజేపీనే అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే మరోమారు కాంట్రవర్సీగా మారాయి.
అలా ఎలా…
సమావేశంలో పిచ్చాపాటిగా మాట్లాడిన అర్వింద్ వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా గెలిచేది బీజేపీనే అని అన్నారు. ‘మీరు నోటాకి వేసినా నేనే గెలుస్తా.. కారుకి ఓటు వేసినా నేనే గెలుస్తా.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా నేనే గెలుస్తాను. మీరు దేనికి ఓటు వేసినా ఓటు పడేది మాత్రం బీజేపీకే’ అని అన్నారు. దీనిని వీడియో తీసిన నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెట్టింట్లో ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఎప్పుడూ సంచలనమే..
ధర్మపురి అర్వింద్ ఏది చేసినా సంచలనమే అవుతుంది. సీఎం కూతురు కవితను ఓడించడం ఓ సంచలనం. ఎన్నికల వేళ.. ఓటర్లకు బాండ్ పేపర్ రాసివ్వడం ఓ సంచలనం. బీజేపీలో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను బండ బూతులు తిట్టే సంచలన నేత అర్వింద్.. ఇక సొంత పార్టీ అధ్యక్షుడిని విమర్శించడమూ ఓ సంచలనమే.. ఇన్ని సంచలనాలు ఉన్న అర్వింద్ తాజాగా ఎన్నికల్లో వేసే ఓట్ల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి.
కేసీఆర్ అదే డిసైడ్ అయ్యారా..
ఇప్పుడు అర్వింద్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అదే నిజమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా డిసైడ్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికల్లోనూ తన కూతురు కవితకు ఓటమి తప్పదన్న ఉద్దేశంతోనే ఈసారి కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ బరిలో దిగుతున్నారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత తన కూతురును కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టి.. గెలిపించుకోవాలన్న వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రెండు నియోజకవర్గాల నుంచి గులాబీ బాస్ బరిలో దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలనే..
2019లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కవిత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నిజామాబాద్‌లో చాలా రోజులు అడుగు పెట్టలేదు. ఈ క్రమంలో తండ్రి కేసీఆర్ పరోక్షంగా కవితను చట్టసభలకు పంపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నిలిపి గెలిపించారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో కవిత గెలవదు అన్న అభిప్రాయం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో ఓడినా.. కామారెడ్డికి ఉప ఎన్నిక తెచ్చి.. కవితను గెలిపించుకోవాలన్న ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.