Dussehra festival : మటన్, మేక తల, నాటుకోడి, బీరు, విస్కీ.. ఈ దసరాకు బిగ్ ఆఫర్స్.. తెలంగాణలో పండుగ అంటే ఇట్లుంటదీ

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఏ షాపింగ్ మాల్‌లో చూసినా ఇదే ఆఫర్ల సీజన్ కనిపిస్తోంది. ఇటీవల నల్లగొండ జిల్లాలో కొంత వెరైటీ ఆఫర్లను చూశాం. 51 రూపాయలు కొట్టు.. మేకను పట్టు అంటూ ఫ్లెక్సీని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అలాగే.. రెండు ఫుల్ బాటిల్స్, రెండు కడక్‌నాథ్ నాటు కోళ్లు, కాటన్ బీర్లు అంటూ ఈ ప్రచారం చేశారు.

Written By: Srinivas, Updated On : September 29, 2024 6:31 pm

Dussehra festival offers

Follow us on

Dussehra festival : తెలంగాణ రాష్ట్రం మొత్తం దసరా పండుగకు ముస్తాబవుతోంది. ముఖ్యంగా దసరాకు ముందు వచ్చే బతుకమ్మ పండుగ కోసం ఇప్పటి నుంచే మహిళలు రెడీ అవుతున్నారు. ఇప్పటి నుంచే షాపింగులు మొదలయ్యాయి. వచ్చేనెల 2 నుంచి రాష్ట్రంలో ఈ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. చిన్నాపెద్దా అంటూ తేడా లేకుండా మహిళలంతా కలిసి ఒక దగ్గరకు చేరి ఈ పండుగను జరుపుకుంటుంటారు. ఒక్కోరోజు ఒక బతుకమ్మను వివిధ పూలతో తయారు చేస్తూ ఆడుతుంటారు. ఇతర దేశాల్లోని తెలంగాణ మహిళలు కూడా ఈ పండుగను జరుపుకుంటుండడం విశేషం. ఈ పండుగ వచ్చిందంటే ఎక్కడ ఉన్న వారు అయినా సొంత ఊళ్లకు చేరుకుంటూ ఉంటారు. ఉమ్మడి కుటుంబంతో సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. అటు.. పిల్లలకు సైతం సెలవులు ఉండడంతో అక్కడే గడిపేందుకు ఇష్టపడుతుంటారు. నిత్యం ఉద్యోగాలతో బిజీగా ఉండే వారు కూడా ఊళ్లకు వచ్చి ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వడం కామన్. అందుకే.. బతుకమ్మ, దసరా పండుగలు వచ్చాయంటే అందరికీ పండుగే.

ఇక దసరా వచ్చేసరికి.. పురుషులకు ఎంతగానో ఇష్టమైన పండుగ అనే చెప్పాలి. దసరా వస్తోందంటే తినడం, తాగడంతో ఒక్కొక్కరు ఊగిపోతుంటారు. ఇక దసరా దావత్‌ల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సుక్కా ముక్కా లేనిదే ఈ పండుగ ఉండదనేది అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఎంతో గ్రాండ్‌గా జరుపుకునే దసరా పండుగ వచ్చిందంటే వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. లక్కీ డ్రా పేరిట కూపన్లు అందజేస్తుంటాయి. ఫలానా అమౌంట్ వరకు షాపింగ్ చేస్తే ఇన్ని కూపన్లు అంటూ ఇస్తుంటాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఏ షాపింగ్ మాల్‌లో చూసినా ఇదే ఆఫర్ల సీజన్ కనిపిస్తోంది. ఇటీవల నల్లగొండ జిల్లాలో కొంత వెరైటీ ఆఫర్లను చూశాం. 51 రూపాయలు కొట్టు.. మేకను పట్టు అంటూ ఫ్లెక్సీని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అలాగే.. రెండు ఫుల్ బాటిల్స్, రెండు కడక్‌నాథ్ నాటు కోళ్లు, కాటన్ బీర్లు అంటూ ఈ ప్రచారం చేశారు.

ఇక జగిత్యాల జిల్లా భీమారంలోనూ కొంత మంది యువకులు ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించారు. వెరైటీ లక్కీడ్రా ఏర్పాటు చేశారు. అందులో 12 రకాల ఆఫర్లను పెట్టడం గమనార్హం. రూ.100తో లక్కీ డ్రాలో పాల్గొంటే మొదటి బహుమతిగా 2 కిలోల మటన్, రెండో బహుమతిగా మేక తల, మూడో బహుమతిగా నాటు కోడిని పెట్టారు. అలాగే.. కోడిగుడ్లు, బీరు, విస్కీ, బట్టలు అంటూ ఆఫర్లను ప్రకటించారు. అక్టోబర్ 11న ఈ లక్కీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దాంతో ఈ ఆఫర్‌లో పోటీ పడేందుకు గ్రామస్తులు రెడీ అయిపోతున్నారు. ఆఫర్‌లో పెట్టిన వస్తువులను కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మరి దసరా పండుగా నేపథ్యంలో ఈ ఆఫర్లను ఎవరిని వరిస్తాయి..? ఎంత మంది పోటీకి వస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.