https://oktelugu.com/

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కి 30 రోజుల విశ్రాంతి..సంక్రాంతి రేస్ నుండి ‘విశ్వంభర’ అవుట్!

గత 15 రోజుల నుండి చిరంజీవి 'చికున్ గణ్యా' తో బాధపడుతున్నాడనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. డాక్టర్లు నెల రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించడంతో చిరంజీవి ప్రస్తుతం తాను హీరో గా నటిస్తున్న 'విశ్వంభర' చిత్రానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చాడు

Written By:
  • Vicky
  • , Updated On : September 29, 2024 6:25 pm
    Megastar Chiranjeevi

    Megastar Chiranjeevi

    Follow us on

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కి ఈమధ్య కాలం లో వరుసగా గొప్ప అరుదైన పురస్కారాలు దక్కుతున్న సంగతి తెలిసిందే. పద్మ విభూషణ్ పురస్కారం తర్వాత ఆయనకు రీసెంట్ గానే అత్యధిక డ్యాన్స్ మూవ్మెంట్స్ వేసిన ఏకైక ఇండియన్ హీరో గా ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో చోటు దక్కింది. ఈ అరుదైన గౌరవం ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా జరిగింది. ఆ తర్వాత మొన్ననే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫెడరేషన్ అకాడమీ (IIFA) అవార్డు కూడా దక్కింది. ‘అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ క్యాటగిరీ లో ఆయనకు ఈ పురస్కారం ని అందించారు. ఇలా వరుసగా ఆయన ఈవెంట్స్ లో పాల్గొని పురస్కారాలు అందుకుంటున్నారు కానీ, గత 15 రోజుల నుండి చిరంజీవి ‘చికున్ గణ్యా’ తో బాధపడుతున్నాడనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. డాక్టర్లు నెల రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించడంతో చిరంజీవి ప్రస్తుతం తాను హీరో గా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చాడు.

    దాదాపుగా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ముగియడానికి కేవలం రెండు పాటలు,క్లైమాక్స్ సన్నివేశం మాత్రమే బ్యాలన్స్ ఉంది. దీనికి కనీసం 20 రోజుల సమయం పడుతుంది. కానీ చిరంజీవి ఆరోగ్యం ప్రస్తుతం షూటింగ్ కి అనుకూలంగా లేకపోవడంతో, సరైన సమయానికి షూటింగ్ పూర్తి కాకపోయే అవకాశాలు ఉన్నందున ఈ చిత్రాన్ని సంక్రాంతి రేస్ నుండి నిర్మాతలు తప్పించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే విశ్వంభర చిత్రం లో గ్రాఫిక్స్ చాలా హై స్టాండర్డ్స్ తో ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో డిజైన్ చేసాడట డైరెక్టర్ వశిష్ఠ. అందుకే సమయం లేనందున ఈ చిత్రాన్ని సమ్మర్ కి వాయిదా వేయడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు విశ్వంభర చిత్రం సంక్రాంతి రేస్ నుండి తప్పుకోవడం తో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని జనవరి 10 వ తారీఖున విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట నిర్మాత దిల్ రాజు.

    దీనిపై ప్రస్తుతం ఆయన తన స్టాఫ్ తో చర్చలు నడుపుతున్నట్టు తెలుస్తుంది. ముందుగా ఈ సినిమాని డిసెంబర్ 20 వ తారీఖున విడుదల చేయాలని అనుకున్నారు. కానీ డిసెంబర్ 6 న ‘పుష్ప 2’ చిత్రం విడుదల కాబోతుంది. ‘గేమ్ చేంజర్’ విడుదలయ్యే రోజున హాలీవుడ్ క్రేజీ చిత్రం ‘ముఫాసా : ది లయన్ కింగ్’ చిత్రం కూడా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాకి మహేష్ బాబు తెలుగు లో వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. దీంతో గేమ్ చేంజర్ కి డిసెంబర్ 20 న వస్తే షోస్ చాలా తక్కువగానే దొరుకుతాయి. ముఖ్యంగా నైజాం ఓవర్సీస్ ప్రాంతాలలో పెద్ద నంబర్స్ రావు, అందుకే జనవరి 10 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.