Big movies : ఈ దసరా కి సత్తా చాటుకోలేకపోయిన భారీ సినిమాలు…
ఒక సినిమాకి భారీ కలెక్షన్లు రావాలంటే అది పండుగ సీజన్ లో వస్తే మాత్రమే దానికి మంచి గుర్తింపు ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఆ సినిమాకి భారీ క్రేజ్ కూడా దక్కుతుంది. అలా కాకుండా మిగిలిన సమయంలో వస్తే జనాలు పెద్దగా ఆ సినిమా మీద ఆసక్తి చూపించరు. కాబట్టి పండుగ సీజన్ లో వస్తేనే ఆ సినిమాకు భారీ కలెక్షన్స్ అయితే దక్కుతాయి...
Big movies : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు దసరా పండగని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో రిలీజ్ కి రెడీ అవుతుంటాయి. నిజానికి ఈ దసరకి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ స్టార్ హీరో సినిమా రాకపోవడం విశేషం… ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో అయిన రజినీకాంత్ హీరోగా వచ్చిన వేట్టయన్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయిందనే చెప్పాలి…
మొదటి షో నుంచే ఈ సినిమా రజినీకాంత్ స్థాయిలో లేదని నార్మల్ హీరో చేసే సినిమా రేంజ్ లో మాత్రమే ఉందని విమర్శకులు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా చేసిన విశ్వం సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. అంటూ సినిమా యూనిట్ నుంచి భారీ ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఇక దాంతో తనదైన రీతిలో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ని అందుకోవాలనుకున్న గోపిచంద్, శ్రీను వైట్ల ల కల కలగానే మిగిలిపోయింది…
ఇక దిల్ రాజు ప్రొడ్యూసర్ గా సుహాస్ హీరోగా వచ్చిన ‘జనక అయితే గనక’ సినిమా కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా కూడా ఆశించిన మేరకు ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. ఇక వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉన్నప్పటికీ సినిమా మాత్రం చాలా వరకు తేడా కొట్టిందనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమా వన్ టైం వాచబుల్ సినిమాగా మాత్రమే మిగిలిపోయింది. తప్ప సూపర్ హిట్ గా మాత్రం మారలేక పోయింది.
సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా కూడా ఆవరేజ్ టాక్ ను సంపాదించుకొని చాలా వరకు వెనుకబడిపోయింది. మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందని అందరు అనుకున్నప్పటికి ఇది కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో సుధీర్ బాబు కి ఇక సక్సెస్ రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని అందరు ఒక నిర్ణయానికైతే వచ్చేసారు… ఇక మునుపెన్నడూ లేని విధంగా దసరా పండుగ సమయంలో ఇలాంటి సినిమాలు వచ్చి సక్సెస్ ను అందుకోకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి.