https://oktelugu.com/

Free Electricity update : తెలంగాణలో ఉచిత విద్యుత్‌పై కీలక అప్‌డేట్‌.. లిమిట్‌ దాటితే బెనిఫిట్‌ క్యాన్సిల్‌!

తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. దీంతో హామీ మేరకు రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 5, 2024 / 07:50 PM IST

    Free Electricity update

    Follow us on

    Free Electricity update : తెలంగాణలో 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఆరు గ్యారంటీ హామీలతో ప్రజలను ఆకట్టుకుంది. దీంతో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై ఆగ్రహంగా ఉన్న ఓటర్లు.. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి మహిళలు ఉచిత ఆర్టీసీ బస్సు, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. రూ.2 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేశారు. అయితే అనేక హామీలు ఇంకా నెరవేర్చాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఉచిత విద్యుత్‌పై తాజాగా ప్రభుత్వం కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. రేషన్‌ కార్డు ఉన్నవారికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. తాజా అప్‌డేట్‌ ప్రకారం.. 200 యూనిట్లకు విద్యుత్‌ వినియోగం మించితే.. ఆ తర్వాత నెల నుంచి సబ్సిడీ వర్తించదు.

    మార్చి నుంచి అమలు..
    తెలంగాణలో 2023 డిసెంబర్‌ 7న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. మార్చి నెల నుంచి ఉచిత విద్యుత్‌ పథకం అమలులోకి వచ్చింది. గృహజ్యోతి ద్వారా తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 10.52 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించిన వారికి జీరో బిల్లు జారీ చేస్తున్నారు. అయితే జీహెచ్‌ఎంసీలో నవంబర్‌ నాటికి లబ్ధిదారుల సంఖ్య 20.71 లక్షలకు పెరిగింది. డిసెంబర్‌లో జారీ చేసిన జీఓ విద్యుత్‌ బిల్లులు కోటి దాటుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

    వినియోం తగ్గించుకుంటే..
    అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 2 లక్షల మంది అర్హత ఉన్నా.. వినియోగం అధికంగా ఉన్న కారణంగా లబ్ధి పొందలేకపోతున్నారు. బంజారాహిల్స్‌ సర్కిల్‌ పరిధిలో లబ్ధిదారులు తక్కువగా ఉన్నారు. కేవలం 36,657 మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు. అయితే వినియోగం ఎక్కువగా ఉన్న కారణంగానే వీరు లబ్ధిపొందడం లేదు. ఈ నేపథ్యంలో అర్హత ఉన్నవారు విద్యుత్‌ వినియోం తగ్గించుకుంటే ఉచిత విద్యుత్‌ పొందే అవకాశం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.