https://oktelugu.com/

Rahul Gandhi : ఇల్లు, కారు లేని కోటీశ్వరుడు.. రాహుల్‌ గాంధీ ఆస్తి ఎంతో తెలుసా?

ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం రాహుల్‌గాంధీ ఆస్తులు రూ.20 కోట్లు. ఇన్ని కోట్లు ఉన్నప్పటికీ ఆయనకు సొంత ఇల్లు, సొంత కారు లేదట. ఇక ఆయనకు రూ.9.24 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అందులో రూ.55,000 నగదు, రూ.26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ.4.32 కోట్ల బాండ్లు, షేర్లు, రూ.3.81 కోట్ల మ్యూచువల్‌ ఫండ్స్, రూ.15.21 లక్షల గోల్డ్‌ బాండ్లు, రూ.4.20 లక్షల నగలు ఉన్నాయి.

Written By: , Updated On : April 5, 2024 / 09:33 AM IST
Rahul Gandhi Election Affidavit

Rahul Gandhi Election Affidavit

Follow us on

Rahul Gandh : కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ. ఇండియా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకపోయినా.. కాంగ్రెస్‌ మాత్రం రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రమోట్‌ చేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన మరోమారు కేరళలోని వాయినాడ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఈమేరకు ఏప్రిల్‌ 3న నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా రాహుల్‌ తన ఆస్తుల వివరాలు వెల్లడించారు.

రూ.20 కోట్ల ఆస్తులు..
ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం రాహుల్‌గాంధీ ఆస్తులు రూ.20 కోట్లు. ఇన్ని కోట్లు ఉన్నప్పటికీ ఆయనకు సొంత ఇల్లు, సొంత కారు లేదట. ఇక ఆయనకు రూ.9.24 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అందులో రూ.55,000 నగదు, రూ.26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ.4.32 కోట్ల బాండ్లు, షేర్లు, రూ.3.81 కోట్ల మ్యూచువల్‌ ఫండ్స్, రూ.15.21 లక్షల గోల్డ్‌ బాండ్లు, రూ.4.20 లక్షల నగలు ఉన్నాయి.

స్థిరాస్తులు ఇవీ..
ఇక రాహుల్‌ గాంధీకి రూ.11.15 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇందులో తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఢిల్లీలోని మెహ్రౌలిలో వ్యవసాయ భూమి ఉంది. గురుగ్రామ్‌లో రూ.9 కోట్ల విలువచేసే ఆఫీస్‌ స్పేస్‌ కూడా ఉంది. అయితే వ్యవసాయ భూమిని వారసత్వంగా వచ్చిన ఆస్తిగా రాహుల్‌ పేర్కొన్నారు. ఇక ఆఫీస్‌ స్పేస్‌ గురించి వివరాలు వెల్లడించలేదు. తనపైన నమోదైన పోలీసు కేసుల గురించి కూడా ఆయన అఫిడవిట్‌లో ప్రస్తావించారు. వీటిలో ఒక పోక్సో కేసు కూడా ఉంది. అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలను ఒక సోషల్‌ మీడియా పోస్టులో వెల్లడించినందుకు ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ఇక ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌ సీల్డ్‌ కవర్‌లో పోలీసులు అందించారని తెలిపారు. అందులోని వివరాలు తనకు తెలియవని పేర్కొన్నారు. తనను నిందితుడిగా చేర్చారా లేదా అన్న విషయాలు తెలియకపోయినా ముందు జాగ్రత్తగా ఆ కేసును కూడా ప్రస్తావించానని రాహుల్‌ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక బీజేపీ నాయకులు దాఖలు చేసిన పరువునష్టం కేసులను కూడా రాహుల్‌ ప్రస్తావించారు. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌కు సబంధించిన నేరపూరిత కుట్ర కేసును రాహుల్‌ తన అఫిడవిట్‌లో వెల్లడించారు.