https://oktelugu.com/

Barrelakka: పెళ్ళైన వారానికే సంచలన పోస్ట్ పెట్టిన బర్రెలక్క! ఇంతకీ ఏమైంది?

యూట్యూబ్ లో వీడియోలు, రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది శిరీష. పొలంలో బర్రెలు కాసుకుంటూ శిరీష వీడియోలు చేసేది. డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం లేక ఆదాయం కోసం బర్రెలు కాస్తున్నాను అంటూ శిరీష చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అయింది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 11, 2024 / 08:06 AM IST

    Barrelakka

    Follow us on

    Barrelakka: సోషల్ మీడియాలో బర్రెలక్క గా పాపులర్ అయిన కర్నె శిరీష రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన సమీప బంధువు వెంకటేష్ అనే అబ్బాయిని కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. భర్తతో కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది. కానీ ఏమైందో ఏమో కానీ .. ఇంతలోనే చాలా బాధపడుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. కాగా సదరు పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

    యూట్యూబ్ లో వీడియోలు, రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది శిరీష. పొలంలో బర్రెలు కాసుకుంటూ శిరీష వీడియోలు చేసేది. డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం లేక ఆదాయం కోసం బర్రెలు కాస్తున్నాను అంటూ శిరీష చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అయింది. దీంతో ఆమెకు బర్రెలక్కగా గుర్తింపు వచ్చింది. అలా సోషల్ మీడియాలో పిచ్చ క్రేజ్ సంపాదించింది. ఇక గత ఏడాది తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది.

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఒక సామాన్యురాలు ఆ స్థాయిలో ప్రభావం చూపడం గొప్ప విషయం. కాగా గతంలో శిరీష పెళ్లి పై ఎన్నో రూమర్స్ వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ వెంకటేష్ ని వివాహం చేసుకుంది. నిశ్చితార్థం, పెళ్ళికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి.

    అయితే తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది బర్రెలక్క. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో .. ‘ ఒక అమ్మాయి కి గాయం అయితే .. గాయం చేసిన వాళ్ళను ఏమీ అనరు .. గాయపడ్డ వారిని మాత్రం మాటలతో చంపుతారు. అమ్మాయి ధైర్యంగా బయట నడవడానికి ఉండదు. మంచోళ్ళు ఉన్నారు .. చెడ్డోళ్లు ఉన్నారు. ప్రతి అమ్మాయిలో తన అమ్మని చూస్తే, తప్పు చేయాలని ఆలోచన రాదు. ఒక అమ్మాయి దాక్కునే పరిస్థితి రాదు. తప్పు చేసిన వాళ్ళు బయట బాగానే ఉన్నారు. కానీ ఏ తప్పు చేయని అమ్మాయిలు బాధపడుతున్నారు అంటూ రాసుకొచ్చింది.

    Barrelakka