https://oktelugu.com/

Niharika Konidela: ప్రేమలో పడ్డ నిహారిక… ఆ సోషల్ మీడియా పోస్ట్ తో పిచ్చ క్లారిటీ! ఎవరతడు?

నిహారిక కొణిదెల భర్తతో విడిపోయిన సంగతి తెలిసిందే. 2020లో చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు వివాహం కాగా .. 2023 లో విడిపోయారు. నిహారిక - వెంకట చైతన్యలది పెద్దలు కుదిర్చిన పెళ్లి.

Written By:
  • S Reddy
  • , Updated On : April 11, 2024 / 08:18 AM IST

    Niharika Konidela

    Follow us on

    Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. సదరు పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె మళ్లీ ప్రేమలో పడిందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ నిహారిక నిజంగానే ప్రేమలో పడిందా? అసలు ఆ మ్యాటర్ ఏంటి? నిహారిక షేర్ చేసిన ఫోటో కు సంబంధించిన వివరాలేంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

    నిహారిక కొణిదెల భర్తతో విడిపోయిన సంగతి తెలిసిందే. 2020లో చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు వివాహం కాగా .. 2023 లో విడిపోయారు. నిహారిక – వెంకట చైతన్యలది పెద్దలు కుదిర్చిన పెళ్లి. బంధు మిత్రుల సమక్షంలో రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. అనూహ్యంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో డివోర్స్ తీసుకున్నారు.

    పెళ్ళైన తర్వాత నిహారిక యాక్టింగ్ కు దూరమైంది. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చింది. అంతే కాదు నిర్మాతగా మారింది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై పలు సినిమాలు, వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఓటిటీలో చెఫ్ మంత్ర పేరుతో వంటల ప్రోగ్రామ్ కు యాంకర్ గా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

    ఈ క్రమంలో తాజాగా నిహారిక షేర్ చేసిన ఫోటో ఒకటి ఆసక్తి రేకెత్తిస్తోంది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో .. ఓ ఏనుగుల జంట రెండు ముఖాలను దగ్గరగా పెట్టుకుని ప్రేమగా చూసుకుంటున్న ఫొటోకు, రెడ్ కలర్ లవ్ సింబల్ జత చేసి పెట్టింది. ఇది చూసిన వారంతా నిహారిక మళ్లీ ప్రేమలో పడిందంటూ చర్చించుకుంటున్నారు. మరి కొందరు ప్రేమ లాంటిది ఏమీ లేదని .. నిహారికకు జంతువులు అంటే ప్రేమ. ఆ పోస్ట్ వెనకున్న భావన అదే అంటున్నారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని నిహారిక చెప్పడం కొసమెరుపు.