https://oktelugu.com/

Bandla Ganesh: తెలంగాణ ఐటీ మినిస్టర్‌ అదుర్స్‌.. బండ్ల గణేశ్‌ కితాబు!

శ్రీధర్‌బాబు పనితీరుపై తెలంగాణ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా టెకీలు శ్రీధర్‌బాబు పనితీరును మెచ్చుకుంటున్నారు. కేటీఆర్‌ను మరపించేలా పనితీరును చూసి క్రమంగా గత మంత్రిని మర్చిపోతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 3, 2024 / 12:55 PM IST

    Bandla Ganesh

    Follow us on

    Bandla Ganesh: తెలంగాణ ఐటీ మినిస్టర్‌ శ్రీధర్‌బాబును కాంగ్రెస్‌ నేత, సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ ఆకాశానికి ఎత్తేశాడు. పదేళ్లు ఐటీ మినిస్టర్‌ అంటే కేటీఆర్‌ అన్నట్లుగానే ఉంది. ముఖ్యంగా టెకీల నోట్లో నాలుకలా మారిపోయాడు. ఇప్పటికీ ఐటీ అనగానే కేటీఆర్‌ అనేలా ఉన్నాడు. అయితే.. కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రస్తుతం ఐటీ మంత్రిగా శ్రీధర్‌బాబు బాధ్యతలు చేపట్టారు. కేటీఆర్‌ను మరిపించేలా తన పనితీరుతో మెప్పిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన నెల రోజులకే దావోస్‌లో నిర్వహించిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు వెళ్లాడు. సుమారు రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నాడు. తెలంగాణ పదేళ్ల చరిత్రలోనే తొలిసారిగా రికార్డుస్థాయిలో పెట్టుబడి తీసుకువచ్చారు.

    బండ్ల గణేశ్‌ ప్రశంస..
    ఇక శ్రీధర్‌బాబు పనితీరుపై తెలంగాణ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా టెకీలు శ్రీధర్‌బాబు పనితీరును మెచ్చుకుంటున్నారు. కేటీఆర్‌ను మరపించేలా పనితీరును చూసి క్రమంగా గత మంత్రిని మర్చిపోతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా ఐటీ మినిస్టర్‌ సైలెంట్‌గా పనిచేసుకుపోవడంపై అభినందనలు వస్తున్నాయి. ఈ క్రమంలో సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్‌ నేత అయిన బండ్ల గణేశ్‌ కూడా తాజాగా శ్రీధర్‌బాబును ఆకాశానికి ఎత్తేశాడు. ఐటీ మినిస్టర్‌ నిత్యం 20 గంటలు పనిచేస్తున్నాడన్నారు. కేవలం 4 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలిపారు. తనను కలవడానికి వచ్చిన అందరినీ కలుస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారని పేర్కొన్నాడు. గత ఐటీ మంత్రికి ప్రజలను కలిసే అవకాశమే ఉండేది కాదనితెలిపారు. దీంతో సమస్యలు చెప్పుకుందామని వచ్చిన వారు నిరాశగా వెనుదిగేవారని గుర్తు చేశారు.