https://oktelugu.com/

Poonam Pandey: పూనమ్ పాండే మరణంలో ట్విస్ట్… బ్రతికి వచ్చింది బాబోయ్

పూనమ్ పాండే ఇంటి సెక్యూరిటీ గార్డ్... ఇక్కడ అంతా ప్రశాంతంగానే ఉందని చెప్పాడు. పూనమ్ పాండే డెడ్ బాడీ ఫోటోలు కూడా బయటకు రాలేదు. ఈ క్రమంలో ఇది పబ్లిసిటీ స్టంట్ కావచ్చని పలువురు భావించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 3, 2024 / 12:57 PM IST
    Follow us on

    Poonam Pandey:  ఎప్పటిలాగే మరోసారి సంచలనానికి తెరలేపింది పూనమ్ పాండే. తాను మరణించలేదని వీడియో విడుదల చేసింది. నిన్న ఉదయం నుండి పూనమ్ పాండే మరణ వార్త దేశాన్ని ఊపేసింది. ఇంస్టాగ్రామ్ వేదికగా పూనమ్ పాండే మరణించినట్లు సందేశం పోస్ట్ చేశారు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా పూనమ్ పాండే చనిపోయారని సదరు సందేశంలో వెల్లడించారు. పూనమ్ పాండే మరణం పై కథనాలు వెలువడ్డాయి. అయితే ఎక్కడో అనుమానాలు ఉన్నాయి.

    పూనమ్ పాండే ఇంటి సెక్యూరిటీ గార్డ్… ఇక్కడ అంతా ప్రశాంతంగానే ఉందని చెప్పాడు. పూనమ్ పాండే డెడ్ బాడీ ఫోటోలు కూడా బయటకు రాలేదు. ఈ క్రమంలో ఇది పబ్లిసిటీ స్టంట్ కావచ్చని పలువురు భావించారు. ఊహించినట్లే పూనమ్ పాండే తన మరణాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకుంది. ఎవరూ చేయని సాహసం చేసింది. నేడు ఆమె వీడియో విడుదల చేసింది.

    సదరు వీడియోలో నేను బ్రతికే ఉన్నాను. గర్భాశయ క్యాన్సర్ తో నేను మరణించలేదు అని పూనమ్ పాండే చెప్పారు. అయితే చాలా మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో మరణిస్తున్నారు. ఇందుకు అవగాహన లోపం కారణం అవుతుంది. గర్భాశయ క్యాన్సర్ ని నయం చేయవచ్చు. సరైన సమయంలో టెస్ట్స్ చేయించుకొని చికిత్స తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు, అని పూనమ్ అన్నారు.

    మరింత సమాచారం కోసం తన వెబ్ సైట్ లోకి లాగిన్ కావాలని వెల్లడించింది. పూనమ్ పాండే వీడియో సంచలనంగా మారింది. ఏకంగా తన మరణాన్ని ఫ్రాంక్ చేసి దేశం మొత్తాన్ని పూనమ్ పిచ్చోళ్లను చేసింది. పూనమ్ పాండే తీరుపై పలువురు విమర్శలు చేస్తున్నారు. పూనమ్ పాండే బోల్డ్ మోడల్, నటి. తెలుగులో పూనమ్ పడే మాలిని అండ్ కో టైటిల్ తో ఒక చిత్రం చేసింది.