https://oktelugu.com/

Stress: ఒత్తిడి వల్ల మీ శరీరం ఏం అవుతుందో తెలుసా?

ఒత్తిడితో బాధపడుతున్నట్టు వాళ్లకు తెలియకపోయినా.. ఇతరులు మాత్రం ఈజీగా ఈ విషయాన్ని గుర్తిస్తారు. పని ఎక్కువైనప్పుడు, భాగస్వామితో గొడవ జరిగేటప్పుడు, ఆర్థిక విషయాల్లో ఒత్తిడి చాలా అర్థం అవుతుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 4, 2024 4:51 pm
    Stress

    Stress

    Follow us on

    Stress: ఇంట్లో ఉంటున్నావు నీకు ఏం టెన్షన్ అంటారు మహిళలను. కానీ ఇంట్లో పిల్లలను, ఇంటి పని, కుటుంబ సభ్యుల పని చూసుకోవడమే పెద్ద డ్యూటీ అవుతుంది. దీని వల్ల చాలా ఒత్తిడికి కూడా గురి అవుతుంటారు. ఇక ఉద్యోగాలు చేసే వారి ఒత్తిడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టెన్షన్ లేనట్టుగా ఫీల్ అయ్యే వారి లైఫ్ లు సూపర్. కానీ చాలా మంది ఒత్తిడితోనే గడిపేస్తున్నారు. అయితే ఈ ఒత్తిడి వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

    ఒత్తిడితో బాధపడుతున్నట్టు వాళ్లకు తెలియకపోయినా.. ఇతరులు మాత్రం ఈజీగా ఈ విషయాన్ని గుర్తిస్తారు. పని ఎక్కువైనప్పుడు, భాగస్వామితో గొడవ జరిగేటప్పుడు, ఆర్థిక విషయాల్లో ఒత్తిడి చాలా అర్థం అవుతుంది. ఒత్తిడి ఎప్పుడో సమస్య లేదు కానీ.. ఎప్పుడూ దీనితో బాధపడితే మాత్రం దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్టే గుర్తు పెట్టుకోవాలి. స్ట్రెస్ ఎక్కువ అయితే రక్తపోటు చాలా పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగిపోతుంది. దీని వల్ల శరీరం బిగుసుకు పోతుందట.

    అందుకే స్ట్రెస్ ఫీల్ అయితే లోతైన శ్వాసను తీసుకోవాలి. అయితే స్ట్రెస్ వల్ల ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఆలోచించరు. కొందరు ఏ విషయాన్నైనా లైట్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఏ విషయాన్ని అయినా ఎక్కువ ఫీల్ అయితేనే స్ట్రెస్ కు ఎక్కువ గురి అవుతారు. శారీరక శ్రమ తగ్గి ఒత్తిడి పెరగటం వల్ల శరీరంలో షుగర్ స్థాయిలు పెరుగుతుంటుంది. దీని వల్ల అనేక రకాల అనారోగ్యాలు వస్తాయి. ఒత్తిడి వల్ల మీ ఆలోచనలో మార్పులు రావడమే కాదు ఏకాగ్రత కోల్పోతారు.

    పనిపై శ్రద్ధ ఉండకుండా.. పని చేయలేకపోతుంటారు. మీ బ్రెయిన్ విశ్రాంతి లేకుండా ఆలోచిస్తంటుంది. ఎప్పుడు చూసినా విసుగ్గానే ఉంటూనే.. ఊరికే చిరాకు పడతుంటారు. ఎవరితో మాట్లాడటానికి ఇష్టం ఉండదు. ఆందోళనకు గుర అవుతుంటారు. తమను తామే తక్కువగా చూసుకుంటారు. డిప్రెషన్ కు లోనై.. ఎందరున్నా లోన్లీ గానే ఫీలవుతారు. అలాగే బాడీ పెయిన్స్ వస్తుంటాయి. మజిల్స్ కూడా నొప్పిగా పెడతాయి. తలనొప్పి వస్తుంది. రాత్రి నిద్ర పట్టదు. కాళ్లు, చేతులు చల్లబడుతుంటాయి.

    నోరు ఎండిపోతుంటుంది. ఛాతిలో నొప్పి వస్తుంటుంది. చేతులు వణుకుతుంటాయి. ఏది మంచి ఏది చెడు అన్న విషయాలను గుర్తించడం కూడా కష్టేమ. ఆలోచనలు నిలకడగా ఉండదు. ఈ స్ట్రెస్ ఎక్కువ రోజులు అలాగే కొనసాగితే.. గుండు పోటు లేదా ఇతర గుండె సమస్యలు వస్తాయి. ఫ్రీగా యాంగ్జైటీ, ఊబకాయం, స్కిన్ ప్రాబ్లమ్స్, లైంగిక సమస్యలు, పల్స్ రేటు మారడం, మతిమరుపు, హార్మోన్ ల అసమతుల్యత, అల్సర్, వంటి అనేక సమస్యలు వస్తాయి. ఇక ఒత్తిడి తగ్గించుకుంటారా? లేదా అనేది ఆలోచించండి