Road Problem: ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఒక వ్యక్తి రోడ్డు బాగా లేదని అక్కడే కూర్చొని నిరసన తెలిపాడు. ఇందుకు సంబంధించిన వార్త వైరల్ గా మారింది. అయితే చాలామంది అతడు చేసేది చాలా కరెక్ట్ అని సోషల్ మీడియాలో కామెడీ చేశారు. అయితే అతడు చేసే పనిని మనం కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ నిరసన ద్వారా కాకుండా ప్రభుత్వానికి రోడ్డు సమస్య తెలియజేయవచ్చు. అయితే సాధారణంగా ఈ సమస్య ప్రభుత్వానికి తెలపాలంటే కాస్త ఇబ్బందులే ఉంటాయి. కానీ ఆన్లైన్లో దీని గురించి తెలిపితే ప్రభుత్వం వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. మరి ఆన్లైన్లో ప్రభుత్వానికి ఎలా తెలపాలో ఇప్పుడు చూద్దాం..
ప్రతిరోజు ప్రయాణం చేసే సమయంలో గుంతలు పడే రోడ్లు.. ధ్వంసం అయ్యే రోడ్లు చూస్తూ ఉంటాం. కానీ రోడ్డు బాగా ఉండాలని కోరుకుంటాం. అయితే ఈ సమస్యను ఇతరులు ప్రభుత్వానికి చెబితే బాగుండు అని కొందరు అనుకుంటే.. మరికొందరు మాత్రం రకరకాల మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇకనుంచి ఆన్లైన్లో దీనిని తెలిపి రోడ్డు సమస్యను పరిష్కరించుకోవచ్చు. అందుకోసం మొబైల్ లోని ఈ వెబ్సైట్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
Google లోకి వెళ్లిన తర్వాత CP gram అని టైప్ చేయాలి. ఇలా డిస్ప్లే అయినా మొదటి వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏ ప్రాంతంలో అయితే సమస్య ఉందో.. దాని గురించిన పూర్తి వివరాలు అందించాలి. అయితే అంతకుముందు రోడ్డు ఫోటోలు తీసుకోవాలి. ఇప్పుడు వెబ్సైట్లో పూర్తి వివరాలు అందించిన తర్వాత ఫోటో ఆప్షన్ వద్ద క్లిక్ చేసి రోడ్డు సమస్య ఉన్న ఫోటోలను అప్లోడ్ చేయాలి. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత 15 లేదా 20 రోజుల్లో ఈ రోడ్డు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే ఈ రోడ్డు సమస్య లపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొందరిని నియమించింది. వీరికి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే ఆయా గ్రామాలు లేదా పట్టణాల్లోకి సంబంధిత అధికారులు లేదా సిబ్బందిని పంపి రోడ్డు సమస్యను పరిష్కరిస్తారు. ఇది ప్రభుత్వానికి చెందిన వెబ్సైట్ కావడంతో ఇందులో పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఫిర్యాదు చేసే సమయంలో ఆ సమస్య నిజమైనదిగా ఉండాలి. కొందరు తప్పుడు ఫోటోలు పెట్టి సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంటుంది. అలా చేస్తే అప్లోడ్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల రోడ్డుకు సంబంధించిన ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నా.. ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు.