SIM Card: ప్రస్తుత కాలంలో మొబైల్ స్కామ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొందరు సైబర్ నేరగాళ్లు మొబైల్ ద్వారా వ్యక్తుల పర్సనల్ డేటాలను సేకరించి బ్యాంకుకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత వివిధ మార్గాల ద్వారా నగదును దోచుకుంటున్నారు. అయితే ఒక వ్యక్తి గురించి సమాచారం మొత్తం సిమ్ కార్డ్ ద్వారా ఇతరులు దొంగిలించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో సిమ్ కార్డ్ పక్కదోవ పట్టకుండా జాగ్రత్త పడాలి. అంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే సిమ్ కార్డులు మన ఆధార్ కార్డుపై తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఇప్పటివరకు ఎన్నో రకాల మోసాలు బయటపడ్డాయి. ఇవన్నీ మొబైల్లోని సిమ్ కార్డ్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. మొబైల్లో సిమ్ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం లేని చోట మొబైల్ నెంబర్ ఇవ్వకపోవడమే మంచిది. అలాగే ఆధార్ కార్డు కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇతరులకు షేర్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ద్వారానే వ్యక్తిలా డేటాను సేకరించి అవకాశం ఉంటుంది. నేటి కాలంలో చాలా మొబైల్ సిమ్ కార్డులు ఆధార్ కార్డుతో లింకు అయి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ రెండిట్లో ఏదో ఒకదానిని ట్రేస్ చేసిన వ్యక్తుల వివరాలను దొంగిలించే అవకాశం ఉంటుంది.
అయితే ఎప్పటికప్పుడు మన ఆధార్ కార్డు లేదా మన సిమ్ కార్డు పై ఎన్ని నెంబర్లు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఆన్లైన్లో చిన్న పని చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ గా పోలీసులు తెలుపుతున్న ప్రకారం… Google లోకి వెళ్లిన తర్వాత tafcop అని టైప్ చేయాలి. ఇప్పుడు డిస్ప్లే అయ్యే మొదటి వెబ్సైట్ లోకి వెళ్లిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద ఉన్న క్యాప్చ ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మొబైల్ లోకి ఓటిపి వస్తుంది.
ఈ ఓటీపీని సంబంధిత బాక్సులో ఎంట్రీ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ లేదా ఆధార్ కార్డు పై ఎన్ని రకాల సిమ్ లు ఉన్నాయో అక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ అందులో మీకు సంబంధం లేని ఏదైనా నెంబర్ కనిపిస్తే వెంటనే పక్కనే ఉన్న not my number అనే దానిపై క్లిక్ చేసి రిపోర్టు చేయవచ్చు. ఇలా రిపోర్ట్ చేసిన తర్వాత ఆ నెంబర్ బ్లాక్ లేదా హెరేజ్ చేసే అవకాశం ఉంటుంది.
ఇలా అప్పుడప్పుడు మొబైల్ నెంబర్ పై ఎన్ని రకాల సిమ్ లు ఉన్నాయో తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలామంది ఇలా ఫేక్ సిమ్ లు తీసుకొని తప్పుడు పనులకు వాడుతూ ఉంటారు. అప్పుడు ఆ నెంబర్ ను ట్రేస్ చేసి ఆధార్ కార్డు ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.