రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేశారా.. స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే..?

తెలంగాణ కేబినెట్ ఈ నెల 8వ తేదీన పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులను ఆమోదించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు అధికారులు దరఖాస్తులను అప్రూవ్ చేశారో లేదో తెలుసుకోవడానికి మీ సేవ నిర్వాహకులను సంప్రదిస్తున్నారు. మీ సేవ నిర్వాహకులకు డబ్బులు చెల్లించి రేషన్ కార్డ్ స్టేటస్ ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే రేషన్ కార్డ్ స్టేటస్ ను తెలుసుకోవడం కొరకు ఎక్కడికీ వెళ్లాల్సిన […]

Written By: Kusuma Aggunna, Updated On : June 11, 2021 5:40 pm
Follow us on

తెలంగాణ కేబినెట్ ఈ నెల 8వ తేదీన పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులను ఆమోదించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు అధికారులు దరఖాస్తులను అప్రూవ్ చేశారో లేదో తెలుసుకోవడానికి మీ సేవ నిర్వాహకులను సంప్రదిస్తున్నారు. మీ సేవ నిర్వాహకులకు డబ్బులు చెల్లించి రేషన్ కార్డ్ స్టేటస్ ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

అయితే రేషన్ కార్డ్ స్టేటస్ ను తెలుసుకోవడం కొరకు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే సులభంగా రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డ్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలని అనుకునే వాళ్లు మొదట https://epds.telangana.gov.in/foodsecurityact/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అందులో fsc search అనే కేటగిరీని ఎంచుకుని అందులో ration card search అనే కేటగిరీలో fsc application search అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

ఆ తరువాత select district అనే ఆప్షన్ లో ఏ జిల్లాకు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటారో ఆ జిల్లాను ఎంచుకోవాలి. search by ఆప్షన్ లో మీసేవ నంబర్, మొబైల్ నంబర్, అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా సులభంగా రేషన్ కార్డ్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు. ఆ తరువాత దరఖాస్తు అప్రూవ్ అయిందో పెండింగ్ లో ఉందో రిజెక్ట్ చేశారో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఈ విధంగా తెలంగాణకు చెందిన వాళ్లు వెబ్ సైట్ ద్వారా ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. ఏ కారణం చేతనైనా రిజెక్ట్ అయితే ఆ సమస్యను పరిష్కరించుకుని మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మంచిది.