https://oktelugu.com/

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగేనా?

కరోనా రెండో దశ క్రమంగా తగ్గుతోంది. కొత్త కోసులు తగ్గడంతో రికవరీలు పెరిగాయి. మొన్నటి వరకు కరోనా మహమ్మారితో పాటు పలు అంశాలపై ప్రధాని మోడీ బిజీగా ఉన్నారు. కరోనా పరిస్థితులు కాస్త శాంతించడంతో కేంద్ర కేబినెట్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉందంటున్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కొందరి శాఖలు మారవచ్చని, ఇంకొందరికి కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది కొత్తవారికి కూడా అవకాశం ఇస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 11, 2021 5:31 pm
    Follow us on

    PM Modiకరోనా రెండో దశ క్రమంగా తగ్గుతోంది. కొత్త కోసులు తగ్గడంతో రికవరీలు పెరిగాయి. మొన్నటి వరకు కరోనా మహమ్మారితో పాటు పలు అంశాలపై ప్రధాని మోడీ బిజీగా ఉన్నారు. కరోనా పరిస్థితులు కాస్త శాంతించడంతో కేంద్ర కేబినెట్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉందంటున్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కొందరి శాఖలు మారవచ్చని, ఇంకొందరికి కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది కొత్తవారికి కూడా అవకాశం ఇస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, కేంద్రప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం.

    ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే కేంద్ర మంత్రులతో అసెస్ మెంట్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. శాఖల వారీగా భేటీలను నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లోనే మంత్రుల పనితీరుపై సమీక్షించనున్నారు. అనంతరం పనితీరు బాగా లేని మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో పరిపాలన విభాగంపై దృష్టి పెట్టేందుకు సమయం దొరికింది.

    దేశంలో మూడో దశ కరోనా పొంచి ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంది. కోవిడ్ దెబ్బకు కకావికలమైన పలు రంగాల్లో పునరుత్తేజం నింపాలని కేంద్రం భావిస్తోంది. 2019లో మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గ పునర్య్వవస్థీకరణ జరగలేదు. ఈనేపథ్యంలో మార్పులు చేర్పులకు ఇదేసరైన సమయమని ప్రధాని యోచిస్తున్నారు.

    వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు యూపీలో కేబినెట్ ప్రక్షాళన చేయడంతో పాటు రాజకీయంగా కీలక మార్పులు చేయాలని భావిస్తున్నారు. సీఎంను మార్చాలన్న ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో యూపీపై బీజేపీపై దృష్టి సారించింది.