https://oktelugu.com/

Akhanda 2 : అఖండ 2 లో బాలయ్య చేస్తున్న రెండు గెటప్ లు ఇవేనా..? బోయపాటి భారీగానే ప్లాన్ చేశాడుగా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా కొంత మంది హీరోలు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తమ స్వశక్తితో ఎదిగిన హీరోలు ఇండస్ట్రీలో చాలా చక్కటి గుర్తింపు ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 16, 2024 / 11:10 AM IST

    Are these the two getups Balayya is doing in Akhanda 2..? Boyapati had a big plan..?

    Follow us on

    Akhanda 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులందరిలో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఎలాంటి సందర్భంలో అయిన భారీ సక్సెస్ ని అందుకోగలిగే కెపాసిటీ ఉన్న హీరోలు కూడా వీళ్లే కావడం విశేషం…ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికీ వాళ్లందరి కంటే కూడా నందమూరి ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు చాలా ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి నుంచి ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరు తమ కంటు ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా వీళ్ళు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తమకంటూ ఒక గుర్తింపునైతే సంపాదించుకోవడంలో వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతూనే వస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్  తనదైన రీతిలో సినిమాలు చేయడం విశేషం… ఇక బాలయ్య బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
    మాస్ ఆడియన్స్ లో ఆయనకు విపరీతమైన క్రేజ్ అయితే ఉంది. ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలన్నీ మాస్ సినిమాలే కావడం వల్ల ప్రేక్షకులందరిలో ఒక సపరేటు గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే… ఇది అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతుంది…
    ఇక దీంతోపాటుగా బాలయ్య బోయపాటి శ్రీను తో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే అకౌంటు ఎక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక అందులో బాలయ్య బాబు ఒకటి అగోర పాత్రలో చేస్తున్నాడు. ఇక మరొక క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది.
    మరి ఈ రెండు పాత్రలని బాలయ్య బాబు చాలా ఈజ్ తో నటించి ఇప్పిస్తాడు అంటూ బాలయ్య అభిమానులు చాలా కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే బోయపాటి శ్రీను కూడా ఈ స్క్రిప్ట్ ను పూర్తిగా రెడీ చేశాడు. కాబట్టి బాలయ్య బాబుకు తగ్గట్టుగానే డైలాగులను కూడా భారీ రేంజ్ లో రాసుకున్నట్టుగా తెలుస్తుంది…