https://oktelugu.com/

CM Revanth Reddy: తెలంగాణ ప్రజల సొమ్ముతో మహారాష్ట్రలో యాడ్స్‌.. ఏంటి రేవంతన్నా ఇదీ!

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి పది నెలలైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అమలవుతున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 5, 2024 / 06:06 PM IST

    CM Revanth Reddy

    Follow us on

    CM Revanth Reddy: తెలంగాణాలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇందుకు కారణం ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు ఒక కారణమైతే.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనతో ప్రజలు విసిగిపోవడం.. కేసీఆర్‌ అహంకార పూరిత పాలనపై ఆగ్రహంగా ఉండడం కూడా కాంగ్రెస్‌ గెలుపునకు దోహందం చేశాయి. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఎన్నికల హామీలు నెరవేర్చడంపై రేవంత్‌ సర్కార్‌ దృష్టిపెట్టింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. ఇటీవలే రైతుల పంట రుణాలు మాఫీ చేశారు. అయితే పూర్తిస్థాయిలో జరగలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల పెంపు, రేషన్‌ కార్డుపై సన్నబియ్యం, విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేదు. ఖరీఫ్‌లో రైతులకు పెట్టుబడి సాయం చెల్లించలేదు. వీటిపై విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ఆందోళనలు చేస్తున్నాయి. ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామని, ఇప్పుడు సన్న వడ్లకు ఇస్తామని మాట మార్చారు. ఇలాంటి పరిస్థితిలో మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది. నవంబర్‌ 13న ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మహారాష్ట్రతోపాటు జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

    మహారాష్ట్రలో ప్రకటనలు..
    ఇదిలా ఉంటే.. తెలంగాణ నేతలు ప్రచారానికి పరిమితం కాకుండా.. తెలంగాణ ప్రజల సొమ్ముతో మహారాష్ట్ర పత్రికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయాలు, గొప్పలు, తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి ప్రకటనలు ఇస్తున్నారు. మరాఠా ఓటర్లను ఆకట్టుకునే ప్రనయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. విపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్రలో ఏం చేస్తారో చెప్పకుండా.. తెలంగాణలో అది చేశాం.. ఇది చేశాం అని గొప్పలు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు తెలంగాణ ప్రజల సొమ్ము వినియోగించడంపై మండిపడుతున్నారు.

    ఆరు గ్యాంరటీలు ఏవి?
    తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యాంరటీలు ఇంకా అమలు కాలేదు. అనేక హామీలు హామీలుగానే ఉన్నాయి. ఈ క్రమంలో రేవంత్‌ సర్కార్‌ మహారాష్ట్రలో తెలంగాణలో అన్నీ చేశామని ప్రచారం చేసుకోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. తప్పుడు ప్రచారంతో మహారాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తోందని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌ను మించిపోయిందని పేర్కొన్నారు. మాజీ సర్పంచుల కోసం బీఆర్‌ఎస్‌ ఆందోళన చేయడంపై మండిపడ్డారు. గతంలో బిల్లులు పెండింగ్‌లో పెట్టిందే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని తెలిపారు. చంపినోడే సంతాప సభ పెట్టిన్లు బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

    మూసీ పునరుజ్జీవం అందుకే..
    ఇక రేవంత్‌సర్కార్‌ తలపెట్టిన మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఓ కాంగ్రెస్‌ నేత అల్డు కోసమే అని బండి సంజయ్‌ ఆరోపించారు. రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన దానికి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతామని అంటున్నారని తెలిపారు. శంషాబాద్‌ ఆంజనేయస్వామి ఆలయంపై దాడిని కండించారు. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించకపోవడంపై ఆహ్రం వ్యక్తం చేశారు. హిందువులంతా రెడ్డెక్కే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.